పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యతోపాటు మతపరిజ్ఞానంకూడ నేర్పించాలి. వారిని దైవమార్గాల్లో నడిపించాలి. పిల్లలకు దైవపిలుపు అందేలా చూడాలి. వాళ్లు మొదట దేవుని బిడ్డలు, తర్వాతనే మన బిడ్డలు అనుకోవాలి. సమూవేలు తల్లి అన్నా తల్లులందరికి ఆదర్శంగా వుండాలి -1సమూ 1,11. గురువు సంస్కారాలు ఈయడం ద్వారా, మఠకన్య ప్రతాల ద్వారా పవిత్రులైనట్లే దంపతులు కుటుంబ జీవితం ద్వారానే పవిత్రులు కావాలి. తిరుసభ తొలిరోజుల్లో లాగ మన యిండ్లే దేవాలయాలు కావాలి. 10. భోగవాదమూ, నిగ్రహమూ 1. భోగవాదం నేటి ప్రపంచం సుఖాలను కోరుకొంటుంది. తిని త్రాగి ఆనందించడం, ఇంద్రియాలను సుఖపెట్టడం, శ్రమను తప్పించుకోవడం చాలమంది ధ్యేయం. కష్టపడి పనిచేయడానికి వొప్పుకోరు. అన్నిటిలోను సులువైన మార్గాలు వెదుకుతారు. చాల వస్తువులు కూడబెట్టుకొని సంతోషిచాంచాలి అనుకొంటారు. సుఖభోగాలు ముఖ్యం అని భావిస్తారు. ఇదే భోగవాదం. ఈ వాదం మనకు పాశ్చాత్య దేశాలనుండి దిగుమతి ఐంది. మన పూర్వులు ఈ భోగమార్గాన్ని అనుసరించలేదు. "శ్రమ ఏవ జయతే" అనేది మన ప్రాచీన ఋషులు పాటించిన సూత్రం. పశువు కేవలం జంతుజీవితం గడుపుతుంది. తాత్కాలికంగా ఇంద్రియ సుఖాన్ని పొంది సంతృప్తి చెందుతుంది. కాని నరుడు బుద్ధి జీవి. అతనికి ఇంద్రియ సుఖాలు ముఖ్యం కాదు. మన ఋషులు ఈ శరీరం నశిస్తుందనీ, ఆత్మ శాశ్వతంగా వుండిపోతుందనీ, నరుడు ఆత్మకు అనుగుణంగా జీవించాలనీ బోధించారు. పశువాంఛలను నిగ్రహంచని నరుడు అనతి కాలంలోనే పశువైపోతాడని చెప్పారు. తినడమూ త్రాగడమూ జ్రమా భౌతిక విలువలు. మన