పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వివాహ సంస్కారాన్ని వధూవరులే ఒకరికొకరు ఇచ్చుకొంటారు. ఇక్కడ గురువు సాక్షి మాత్రమే. ఈ సంస్కారానికి ప్రత్యేక వరప్రసాదం వుంటుంది. దీని వలన దంపతుల ప్రేమ జంతు ప్రేమనుండి దివ్యప్రేమగా మారుతుంది. వాళ్లు పరస్పరం పవిత్రపరచుకొని బిడ్డలను పుణ్యమార్గంలో పెంచుతారు. వివాహ జీవితంలో కూడ సిలువలు ఎదురౌతాయి. దంపతులకు మనసులు కలవక పోవడం, వ్యాధిబాధలు మరణం, పిల్లలు మాట వినకపోవడం, దారిద్ర్యం మొదలైన నానా బాధలు వేధిస్తాయి. దంపతులు తమ శ్రమలను క్రీస్తు శ్రమలతో చేర్చి తండ్రికి అర్పించుకోవాలి. కానావూరి వివాహంలో లాగ క్రీస్తు మన కుటుంబంలో ప్రత్యక్షమై వుంటే శ్రమలకు తట్టుకోవచ్చు. లైంగిక క్రియ పవిత్రమైంది. దానిద్వారానే బిడ్డలు కలిగేది. దాని ద్వారా దంపతులు దేవుని సృష్టితో సహకరించి ప్రతిసృష్టి చేస్తారు. కనుక వాళ్లు ఒకరికొకరు దేహదానాన్ని చేసికోవాలి -1కొరి 7,3-4 ఇది దాంపత్య పుణ్యం. దీనిద్వారా ఆలుమగలు ఒకరికొకరు వరప్రసాద కారకులు ఔతారు. ఈ క్రియలో ఆలుమగలు నేనెంత సుఖాన్ని పొందానా అనికాక, భాగస్వామిని ఎంతగా సుఖపెట్టానా అని ఆలోచించాలి. లైంగిక క్రియ గృహస్టుల పవిత్రతలో ఓ ప్రత్యేకాంశం. గురువు మఠకన్య దైవకార్యాల్లో మునిగి వుండాలి. గృహస్థులు లౌకిక కార్యాల్లో నిమగ్నులు కావాలి -ఆది 1,28. పొలం పని, ఇంటిలోని పని, ఉద్యోగం మొదలైనవాటిల్లో మనసుపెట్టి శ్రమచేయాలి. మన పనులు రేపు దేవుని సమక్షంలో మనకు అనుకూలంగా సాక్ష్యం పలికేలా వుండాలి. గృహస్టులు కుటుంబ భక్తిలో వృద్ధి చెందాలి. మన యిల్లు కూడ ఓ దేవాలయంగా మారాలి. ఇంటిలో బైబులు పఠనం, ప్రార్ధనం జరగాలి. క్రీస్తు సాన్నిధ్యం నెలకొని వుండాలి. పరస్పర సహాయం, ఓర్పు, ప్రేమ మొదలైన సుగుణాలు కన్పించాలి. తల్లిదండ్రులు పిల్లలకు లౌకిక