పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనలను సందర్శించడానికి వచ్చి మన దేవాలయాల్లో నెలకొని వుంటాడు. మనం అతన్ని సందర్శించి ఆరాధించి మన కష్టసుఖాలు అక్కరలు అతనికి విన్నవించి సహాయాన్ని అడుగుకోవాలి. ఆ ప్రభువు దీవెనలు పొందాలి. ఇంకా ఈ సందర్శనాలు సత్ర్పసాదాన్ని భోజనంగా స్వీకరించాలనే కోరికను పుట్టిస్తాయి. ఈ సందర్శనాలు మన క్యాతలిక్ సమాజానికి ప్రత్యేకం. ప్రొటస్టెంటులు మనలాగ సత్ర్పసాదాన్ని పదిలపరచరు. కనుక విశ్వాసులు అవకాశం కలిగినపుడెల్ల దేవాలయంలో ప్రభువును సందర్శించి కొంతసేపు అతని సన్నిధిలో వుండిపోవాలి. అతని ముఖకాంతి మనమీద ప్రసరించాలి -సంఖ్యా 6,25. అన్యుల యిండ్లల్లో వేయిదినాలు వసించిన దానికంటె ప్రభువు మందిరంలో ఒక్కరోజు గడపడం మెరుగు అనుకోవాలి -కీర్త 84.10. 3. వివాహ జీవితం క్రైస్తవ ప్రజల్లో అధికసంఖ్యాకులు వివాహ జీవితం గడిపేవాళ్లు. స్త్రీ పురుషులు కలసి జీవించాలని భగవంతుని కోరిక. ఈ కలయిక ద్వారానే గృహస్టులు పవిత్రులు కావాలి. వివాహ ధర్మాలు రెండు. మొదటిది, భార్యాభర్తలు పరస్పర ప్రేమతో జీవించాలి. తల్లిదండ్రులు కూడ ఈ ప్రేమకు అడ్డురాకూడదు -ఆది 2,24. రెండవది, దంపతులు సంతానాన్ని కనాలి. నరజాతి విస్తరిల్లాలి. బిడ్డలు దేవుని వరం -1.28. పూర్వ వేదంలో దేవుడు భర్త, యిస్రాయేలు ప్రజలు అతని భార్యలాంటివాళ్లు అనే భావం వుంది -యెష 54, 5. నూత్నవేదంలో క్రీస్తు వరుడు, తిరుసభ అతని వధువు. క్రైస్తవ వివాహంలో ఈ పోలిక వధూవరులమీద సోకుతుంది. వరుడు క్రీస్తుకి పోలికగా వుంటాడు. క్రీస్తులాగే అతడు భార్య కొరకు ఆత్మార్పణం చేసికోవాలి. వధువు తిరుసభకు పోలికగా వుంటుంది. ఆమె భర్తను ప్రేమించి అతనికి లొంగివుండాలి. క్రైస్తవ వివాహాన్ని పవిత్రం చేసేది యీ పోలికే.