పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేవుడు వాటిని దీవించి క్రీస్తు శరీరరక్తాలుగా మార్చి మళ్లా వాటిని మనకు ఆహారంగా దయచేస్తాడు. సత్ర్పసాదం మనలను క్రీస్తుతో ఐక్యం జేస్తుంది. క్రీస్తు తండ్రితోలాగే మనం క్రీస్తుతో ఐక్యమౌతాం -యోహా 17, 21 ఇంకా అది మనలను తోడి విశ్వాసులతో ఐక్యం జేస్తుంది. ఒకే రొట్టెలో పాలు పొందే వాళ్లంతా ఒకే శరీరం ఔతారు -1కొరి 10, 17 భారతదేశంలో కులాలు వర్గాలు మనలను నిరంతరం విభజిస్తుంటాయి. దివ్యాహారం ఈ విభజనకు అడ్డుకట్ట వేయాలి. సత్ర్పసాదం తిరుసభను నిర్మిస్తుంది. విశ్వాసుల సంఖ్యను పెంచి వాళ్లు ఐక్యభావంతో సోదరప్రేమతో జీవించేలా చేస్తుంది. విశ్వాసులు పూజలో పాల్గొంటేనే చాలదు. యోగ్యంగా దివ్యాహారాన్నికూడ స్వీకరించాలి. పూజలో పాల్గొని దివ్యాహారాన్ని భుజించేవాడే నిజమైన క్రైస్తవ భక్తుడు. 3) సాన్నిధ్యంగా సత్ర్పసాదం ప్రభువు సత్రసాద రూపంలో మన మధ్య వసిస్తుంటాడు. మనం ఆ ప్రభువును సందర్శించాలి. పూర్వవదేంలో ఎడారికాలంలో దేవుడు జనం మధ్య గుడారంలోను, మేఘంలోను, మందసంలోను వసించాడు. ఆ పిమ్మట సొలోమోను దేవాలయంలో వసించాడు. ఈలాగే క్రీస్తు యిప్పడు మన దేవాలయంలోని సత్ర్పసాదంలో వసిస్తుంటాడు. వస్తుసాన్నిధ్యం వుంది. చాలకుర్చీలు ఒక తావులో వుంటాయి. అవి ఒకదాన్నొకటి గుర్తించవు. ప్రేమించవు. దీనికి భిన్నంగా వ్యక్తి సాన్నిధ్యం వుంది. భార్యాభర్తలు, తల్లిదండ్రులూ పిల్లలూ ఒక యింటిలో వసిస్తారు. వీళ్లు ఒకరినొకరు గుర్తిస్తారు, అంగీకరిస్తారు, ప్రేమిస్తారు. సత్ర్పసాదంలో క్రీస్తు సాన్నిధ్యం ఈ రెండవదాని లాంటిది. అతడు మనమీది ప్రేమతో, మనలను ఆదుకోవడానికి, మన దేవాలయాల్లో వసిస్తుంటాడు. పూర్వవేదంలో దేవుడు ఈజిప్టు బానిసంలో మూలుతూ వున్న యిస్రాయేలు ప్రజలను సందర్శించి వ్రారికి మేలు చేశాడు. ఇప్పుడు క్రీస్తు