పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుపుతాం. మూడవది బలిద్వారా పాపపరిహారాన్ని పొందుతాం. నాల్గవది, మనకు కావలసిన వరప్రసాదాలు పొందుతాం. పూజాబలి మన దైవార్చనలో కొండశిఖరం లాంటిది. దానికి మించిన ఆరాధనం లేదు. మనం ప్రధానంగా పవిత్రులమయ్యేది పూజబలి ద్వారానే కనుక దానిలో అత్యంత శ్రద్ధతో పాల్గొనాలి. మన భక్తి అంతా దాని చుట్టే వుండాలి. 2) భోజనంగా సత్ర్పసాదం పూర్వవేదంలో మన్నా భోజనం వుంది. ఇది సత్ర్పసాదాన్నే సూచిస్తుంది. నూత్నవేద ప్రజలకు ఈ దివ్యభోజనం విందు. క్రీస్తు తండ్రి నుండి జీవం పొందుతాడు. మనం క్రీస్తునుండి జీవం పొందుతాం. ప్రభువు జీవమయి శరీరం మనకు కూడ జీవాన్నిస్తుంది. నిప్పలో పెట్టిన యినుపముక్కనిప్పగా మారిపోతుంది. నిప్పకణిక చుటూ ఊకను పేర్చితే అది కూడ రగులుకొని మండుతుంది. ఈలాగే క్రీస్తు శరీరం మనలను కూడ దివ్యలను చేస్తుంది. సత్రసాదం ద్వారా క్రీస్తు మనకు అమరత్వాన్నీ దైవత్వాన్నీ దయచేస్తాడు. దివ్యభోజనం మనకు ఉత్థాన భాగ్యాన్ని దయచేస్తుంది. నన్ను భుజించేవాణ్ణి నేను అంతిమదినాన లేపుతాను అన్నాడు ప్రభువు –యోహా 6,54. గోదుమ గింజను భూమిలో నాటితే దానిలోని జీవశక్తి వల్ల మళ్లా మొలకెత్తుతుంది. ఈలాగే భూమిలో నాటబడిన మన శరీరాల్లో దివ్యభోజనం జీవశక్తిగా పనిచేసి లోకాంతంలో అవి మళ్లా లేచేలాగ చేస్తుంది. అన్ని భోజనాలు మనలోనికి మారతాయి. దివ్యభోజనం మనలోనికి మారదు. మనలను తనలోనికి మార్చుకొంటుంది. అది దేవుడు కనుక మనకు దైవత్వాన్ని దయచేస్తుంది. ఈ భోజనం ద్వారా ఇచ్చి పుచ్చుకోవడం అనే సూత్రం నెరవేరుతుంది. పూజలో మనం దేవునికి అప్పరసాల్లు_క్రానుకగా సమర్పిస్తాం. నడిపూజలో