పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీన్ని యిప్పడు మనమధ్యలో కొనసాగించడం ఏలా? ప్రభువు దీన్ని అంత్య భోజన బలిలోకి ప్రవేశపెట్టాడు. పెద్ద గురువారం సాయంత్రం శిష్యులతో పాస్కవిందు ఆరగిస్తూ రొట్టె రసాలు తీసికొని ఇది నా శరీరం, మీరు దీన్ని భుజించండి అన్నాడు. ద్రాక్షరసాన్ని తీసికొని యిది నా రక్తం, మీరు దీన్ని పానం చేయండి అన్నాడు -మార్కు 14,22-26. రొట్టెరసాల రూపంలో తన్నుతాను మనకు సంపూర్ణంగా సమర్పించుకొన్నాడు. ఈ బలి మనమధ్యలో కొనసాగిపోవాలని కోరుకొన్నాడు. ఇదే నేటి పూజబలిగా రూపొందింది. కల్వరిబలి పూజబలిలోకి ప్రవేశించింది. සඹී వుద్దేశం దేవునితో ఐక్యంగావడం బలిలో మనం అర్పించే పశువు మనకే గుర్తు పూజబలిలో మనం అర్పించే బలిమూర్తి క్రీస్తే. కనుక బలిలో ఈ క్రీస్తుద్వారా మనం తండ్రితో ఐక్యమౌతాం. రోజువారి పూజబలిలో మనం కానుకలుగా అర్పించే రొట్టెరసాలు మనకే గుర్తుగా వుంటాయి. ఈ వస్తువులే నడిపూజలో క్రీస్తుగా మారతాయి. పూజలో క్రీస్తుతోపాటు మనలను మనం తండ్రికి అర్పించుకొని అతనితో ఐక్యం గావాలి. గృహస్టులకు కూడ జ్ఞానస్నాన యాజకత్వం వుంది. ఈ యాజకత్వం ద్వారానే బలిని సమర్పించే గురువుతో ఐక్యమై, మనలను మనం తండ్రికి అర్పించుకొని అతనితో ఐక్యం గావాలి. ఈ సందర్భంలో పౌలు భక్తుడు మీ జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అన్నాడు -రోమా 12,1. కనుక మన కష్టసుఖాలు, జయాపజయాలు, పనులు ఆస్తిపాస్తులు కుటుంబాలు సంగ్రహంగా చెప్పాలంటే మన జీవితమంతా దేవునికి సమర్పితం కావాలి. మనం ప్రభువుకి సాక్షులంగా నిలవాలి. దీని ద్వారానే మనం పవిత్రుల మయ్యేది. బలి ఫలితాలు నాలు. మొదటిది, బలిలో దేవుణ్ణి ఆరాధిస్తాం. పూర్వవేద ప్రజలు దాస్య విముక్తిని పొంది దేవుణ్ణి ఆరాధించారు. ఇప్పడు మనం పాపవిముక్తిని పొంది దేవుణ్ణి ఆరాధిస్తాం. రెండవది దేవునికి కృతజ్ఞత