పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్వారా యాజకులయ్యారు -నిర్గ 19, 5-6. క్రైస్తవ ప్రజలు జ్ఞానస్నానం ద్వారా యాజకులౌతారు. యాజకరూపరాజ్యం, పవిత్రప్రజ ఔతారు - 1పేతురు 2,9-10. మనం చిన్నపిల్లలంగా వున్నప్పుడు జ్ఞానస్నానం పొందుతాం. అప్పుడు మనకేమీ తెలియదు. కాని పెరిగి పెద్దయ్యాక ఈ సంస్కారంలోని గూధార్థాలను బాగా అర్థం జేసికోవాలి. ఇది మన క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది. గొప్ప అర్చ్యశిష్టులు కూడ జ్ఞానస్నాన పవిత్రతను దాటిపోలేదు. ఈ సంస్కారం బాధ్యతలను నిర్వహించేవాడు గొప్ప భక్తుడనే చెప్పాలి. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినవాడు క్రమేణ ఆ ప్రభువులోకే మూరిపోతాడు. ఇంకా ఈ నంస్కారం మనలను (పేషిత సేవకు కూడ పురికొల్పుతుంది. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన వాళ్లు ఆ ప్రభువుని పదిమందికి తెలియజేసే బాధ్యతను గూడ పొందుతారు. 2. సత్ర్పసాదం జ్ఞానస్నాన జీవితం సత్ర్పసాదం ద్వారా పరిపూర్ణమౌతుంది. ఈ సంస్కారంలో మూడంశాలు వున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం. 1) బలిగా సత్ర్పసాదం సృష్ట్యాదిలో కయినాను హేబెలు దేవునికి బలులర్పించారు. పితరులు బలులు అర్పించారు. యెరూషలేము దేవాలయంలో చాల బలులు అర్పించారు. పాస్మబలీ, సీనాయి నిబంధన బలీ వున్వాయి. పూర్వవేద బలులు రక్తసహిత బలులుగాను రక్తరహిత బలులుగాను గూడ వుండేవి. ఇవన్నీ రాబోయే కల్వరిబలినే సూచించాయి. క్రీస్తు సిలువబలిద్వారా మన పాపాలకు పరిహారం చేశాడు. ఆ బలి లోకాంతం వరకు మన మధ్యలో కొనసాగిపోవాలని కోరుకొన్నాడు. కాని అది రక్తసహిత బలి. పైగా వొక్కసారి మాత్రమే సమర్పించిన ఏకైక బలి.