పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దీనివలన మనం దేవునికి దత్త సంతానమాతాం. ఈ క్రియ ద్వారా దేవుని కుటుంబంలోకి ప్రవేశిస్తాం. క్రీస్తు తండ్రికి సహజపుత్రుడు. మనం దత్తసంతానం ఔతాం. దేవుణ్ణి తండ్రీ అని పిలుస్తాం. దేవునినుండి వారసంగా వచ్చిన మోక్షాన్ని పొందుతాం. ఆత్మే ఈ భాగ్యాలన్నీ సాధించి పెడుతుంది -రోమా 8, 15-17. జ్ఞానస్నానం వలన ఆత్మను పొందుతాం -అచ 2,38. ఈ యాత్మ మనలను దేవాలయంగా మార్చి పవిత్రపరుస్తుంది. ఇది మనకు క్రొత్త పుట్టుకనూ, నూత్నసృష్టినీ దయచేస్తుంది. ఆదామునుండి ప్రాత పుట్టుకను పొందాం. ఇప్పడు జ్ఞానస్నానం ద్వారా క్రొత్త పుట్టుకను పొందుతాం. ఇంకా, దీనివలన నూత్నసృష్టి ఔతాం - 2కొరి 5, 17. పాపియైన నరుడు పవిత్రుడు ఔతాడు. దేవునికి శత్రువైనవాడు అతనికి మిత్రుడౌతాడు. నిత్యజీవానికి అరుడైతాడు. జ్ఞానస్నానంలో మనం స్వీకరించే తెల్లకండువాలో ఈ భావాలన్నీ వున్నాయి. ఈ సంస్కారం ద్వారా పాపపరిహారాన్ని పొందుతాం. ఈ క్రియ మన జన్మపాపాన్నీ కర్మపాపాలనూ గూడ తొలగిస్తుంది. ఉత్తరించే స్థలంలో మన కొరకు కాచుకొని వున్న అనిత్య శిక్ష కూడ తొలగిపోతుంది. కనుకనే పాపవిమోచనాన్ని దయచేసే ఒకే జ్ఞానస్నానాన్ని విశ్వసిస్తున్నాను అని చెప్తాం. దీని వలన క్రీస్తు మూడు గుణాల్లో పాలు పొందుతాం. 1)ప్రభువు రాజు. అనగా పాలకుడు. అతనిలోనికి జ్ఞానస్నానం పొందిన గృహస్టులు ఈ విశాల ప్రపంచాన్ని వశంజేసికోని దాన్ని పరిపాలిస్తారు -ఆది 1,28. 2క్రీస్తు ప్రవక్త. అనగా బోధకుడు. అతని లోనికి జ్ఞానస్నానం పొందిన గృహస్థులు కూడ బోధకులు ఔతారు. ఆదర్శ జీవితమే గృహస్టుల ప్రధాన బోధ. ఇంకా వాళ్లు క్రీస్తు బోధను ఆచరణలో పెడతారు. 3)క్రీస్తు యాజకుడు. అనగా పవిత్ర పరచేవాడు. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందిన గృహస్టులు దైవార్చనలో పాల్గొని దేవుణ్ణి పూజిస్తారు. యూదులు సీనాయి నిబంధనం