పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రోత్సహిస్తుంటారు. భక్తసమాజంలో ప్రభువు సాన్నిధ్యం అధికంగా వుంటుంది. నా పేరు మీదిగా ఇద్దరు ముగ్గురు ప్రోగయినచోట నేనూ వుంటాను అనే ప్రభువు వాక్యం వుంది -మత్త 18,20. కనుక క్రైస్తవ భక్తులు వీలైనప్పుడెల్లదైవార్చనలో పాల్గొని పుణ్యపరిపూర్ణతను అధికాధికంగా సాధించాలి. సన్మనస్కులు అంతటివాళ్లు భూలోకంలో జరిగే దైవార్చనలో పాల్గొని దేవుణ్ణిస్తుతిస్తారు. పాపపు నరులమైన మనం అశ్రద్ధ చేస్తే యేలా? 2. సంస్కారాలు దైవార్చనలో ముఖ్యమైనవి ఏడు సంస్కారాలు. ప్రస్తుతానికి వీటిల్లో మూడింటిని మాత్రం పరిశీలిద్దాం 1. జ్ఞానస్నానం జ్ఞానాస్నానం మొదట స్వీకరించే సంస్కారం. ఇది ఆధ్యాత్మిక జీవితానికి ద్వారం లాంటిది. దీనిద్వారా పిశాచం బిడ్డడైన నరుడు దేవుని బిడ్డడౌతాడు. ఈ సంస్కారం చాల ఫలితాలను చేకూర్చిపెడుతుంది. ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం. దీనిద్వారా తిరుసభలో సభ్యులమౌతాం. క్రీస్తు జ్ఞానశరీరంలో చేరతాం. గురువు మనపేరు రిజిస్టరులో వ్రాస్తారు. ఆలా వ్రాయడం తిరుసభలో చేరామనడానికి గురుతు. తిరుసభ అనే తల్లి జ్ఞానస్నానం ద్వారా మనలనుకని దివ్య జీవాన్ని అందిస్తుంది. ఆ సభ పవిత్రంగా వుంటుంది. ఆ తల్లికి బిడ్డలమైన మనం కూడ నిర్మలజీవితం గడపాలి. ఇది క్రీస్తుతో ఐక్యం జేస్తుంది. ఈ సంస్కారం వలన క్రీస్తు మరణోత్థానాలు మనమీద సోకుతాయి. అతనితోపాటు మనం కూడ మరణిస్తాం. అనగా పాపానికి మరణిస్తాం. అతనితోపాటు మనం కూడ వుత్థానమౌతాం. ఈ వుత్థానం పుణ్యజీవితానికి -రోవూ 6, 3-4. ఈ సంస్కారం ద్వారా మనకు మొదటిసారిగా క్రీస్తుతో పరిచయం కలుగుతుంది. అప్పటినుండి అతని దివ్యశక్తి మనల్తోస్తికై ప్రవేశించడం మొదలుపెడుతుంది.