పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మామూలు సంవత్సరం జనవరి 1తో ప్రారంభమౌతుంది. దైవార్చన సంవత్సరం ఆగమనకాలంతో మొదలుపెడుతుంది. ఆ పిమ్మట క్రీస్తు జయంతి, క్రీస్తు సాక్షాత్కారం వస్తాయి. అటు తర్వాత తపస్సు కాలం వస్తుంది. ఆ9 పిమ్మట ఉత్థాన కాలం వస్తుంది. ఆరాధన సంవత్సరంలో కల్ల గొప్పది ఉత్థాన పండుగే. ఈ పండుగనే ప్రతి ఆదివారం నూతీకరిస్తాం. ఉత్థానం తర్వాత పెంతెకోస్టు పండుగ వస్తుంది. దైవార్చన సంవత్సరం క్రీస్తు మొదటి రాకడతో ప్రారంభమై ప్రభువు రెండవ రాకడ వరకు కొనసాగిపోతుంది. దీనిలో భూతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడుకాలాలు వుంటాయి. ఇవి ఆరాధన సంవత్సరంలోని ముఖ్య సంఘటనలు. ఈ సంవత్సరం పొడుగున క్రీస్తు జీవిత సంఘటనలు స్మరించుకొంటాం. మరియమాత, ఇతర పునీతులను జ్ఞప్తికి తెచ్చుకొంటాం. క్రీస్తు జీవితంలోని పవిత్ర సంఘటనలను జ్ఞాపకం చేసికోవడం వలన ఆ ప్రభువు మనకు యధార్థంగా ప్రత్యక్షమై మనలను పవిత్ర పరుస్తాడు. పునీతులను జ్ఞప్తికి తెచ్చుకోవడం ద్వారా వాళ్లు మనకొరకు ప్రార్ధనచేసి మనలను దీవిస్తారు. దైవార్చన క్యాలెండరును వాడుకొని ఆరాధన సంవత్సరం పొడుగున వచ్చే పండుగల్లోను అవకాశం కలిగినప్పడెల్ల దివ్యపూజలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందాలి. క్రైస్తవ భక్తుడు ఏడాది పొడుగున క్రీస్తుతో ఐక్యమై జీవించాలి. ప్రభువు నేను పవిత్రుజ్జయిన దేవుణ్ణి. నన్ను కొలిచే ప్రజలైన మీరు కూడ నాలాగే పవిత్రంగా జీవించాలి అని చెప్పాడు -లేవీ 19,2. పవిత్రత కేవలం మన కృషితో మనం సాధించేది కాదు. అది దేవుడు దయచేసేది. ఇక, మనలను పవిత్ర పరచే ప్రధాన సాధనం దైవార్చనే. కనుక దానిపట్ల మనకు భక్తీ శ్రద్ధ వుండాలి. సంవత్సరమంతా దైవార్చన మనకు విశ్వాస సత్యాలను జ్ఞాపకం చేస్తుంది. పూజల్లో వచ్చే బైబులు పఠనాలు మంచి ఉపదేశాన్ని అందిస్తాయి. ప్రార్థనలు, భక్తిగీతాలు వివిధ సంజ్ఞలు మన భక్తిని మేలుకొల్పుతాయి. తోడి క్రైస్తవులు మన ప్రక్కనే వుండి మనలను