పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీస్తు శిరస్సు తిరుసభ అతని దేహం. కనుక మనం కూడ క్రీస్తుతో ఐక్యమై అతనితో పాటు తండ్రిని ఆరాధిస్తాం. దైవప్రజలు జ్ఞానస్నానాన్ని పొందినవాళ్లు. ఈ సంస్కారం ప్రజలను క్రీస్తుతో ఐక్యం జేస్తుంది. ఈ జనంలో మళ్లా కొందరు గురుపట్టాన్ని పొందిన యాజకులు. గురుపట్టం ద్వారా వీళ్లు క్రీస్తుకి ఎక్కువగా పోలివుంటారు. ఈ యాజకులూ గృహస్థులూ కలసి క్రీస్తుతో ఐక్యమై తండ్రిని ఆరాధిస్తారు. కనుక గృహస్థులు దివ్యపూజలో చురుకుగా పాల్గొనాలి. అది గురువు పనిలే అనుకోగూడదు. జ్ఞానస్నానం పొందిన వాళ్లంతా నూటికి నూరుపాళ్లు ఆరాధకులే. వ్యక్తిగతమైన ఆరాధనం దైవార్బనం కాదు. జ్ఞానదేహమైన విశ్వాసులంతా కలసి సామూహికంగా చేసే ఆరాధనే దైవార్చన. ఆరాధనలు రకరకాలుగా వుండవచ్చు. కాని దేవార్చనకు మించిన ఆరాధన మరేదీ లేదు. అది ఆరాధనలన్నిటిలోను కొండ శిఖరం లాంటిది. శిఖరం కొండ అంతటిలోను ఎత్తయిన భాగం కదా! దైవార్చనలో క్రీస్తు ముఖ్యవ్యక్తి కనుక అది కొండ శిఖరమైంది. ఇంకా దైవార్చన ఇప్పడు తిరుసభ స్వీకరించే వరప్రసాదాలన్నిటికీ ఊటలాంటిది. బావిలోని నీళ్లన్నీ ఊటద్వారానే వస్తాయి. తిరుసభకు లభించే వరప్రసాదాలన్నీ దైవార్చన ద్వారానే వస్తాయి. కనుక దైవర్చానలో పాల్గొనడం కంటె మనం చేయదగిన గొప్ప పని, పవిత్రకార్యం మరేదీ లేదు. దైవార్చనలో దివ్యపూజ ప్రధానమైంది కనుక దానిలో వుత్సాహంతో పాల్గొనాలి. శరీరమూ, మనసూ రెండూ ఆరాధనలో పాల్గొనాలి. వట్టి బాహ్యక్రియలు చాలవు. ఈ ప్రజలు నన్ను పెదవులతో గౌరవిస్తున్నారు గాని వీళ్ల హృదయాలు నాకు దూరంగా వున్నాయి అన్నట్లుగా వుండకూడదు -యెష 29, 13. ఏయే అంశాలు దైవార్చనలోకి వస్తాయి? దివ్యపూజ, ఏడు సంస్కారాలు, మఠవాసులు గురువులు ఉదయసాయంకాలాల్లో చెప్పకొనే ప్రార్థనలు మొదలైనవన్నీ మ్కా వస్తాయి.