పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనుదిన పూజలో వచ్చే వేదపఠనాలను విశ్వాసులు ముందుగానే జాగ్రత్తగా చదువుకోవాలి. గురువులు ఆదివారాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పూజలో వచ్చే వేదపఠనాల మీద కూడ కొద్దిగా వివరణం చెప్పాలి. ఈ పఠనాల ద్వారా సంవత్సరం పొడుగున ఎంతో బైబులు జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. మన కుటుంబాల్లో వేదపఠనాలతో కూడిన దైవార్చన క్యాలెండరు తప్పక వుండాలి. ఇప్పడిప్పుడే మన ప్రజల్లో బైబులు జ్ఞానం పెరుగుతూంది. ఇది శుభపరిణామం. ఈ జ్ఞానం ఇంకా చాల పెరగాలి. మన విశ్వాసులు బైబులు క్రైస్తవులుగా మారాలి. ఆ గ్రంథం రోజువారి జీవితంలో మనలను నడిపించేదిగా, ఆయా సంఘటనల్లో సమస్యల్లో మనకు వెలుగును చూపేదిగా వుండాలి. ఇందుకు మనమూ మన మతపెద్దలూ చాలా కృషి చేయాలి. 9. దైవార్చన, సంస్కారాలు 1. దైవార్చన ప్రాముఖ్యం యూద ప్రజలు, క్రైస్తవ ప్రజలు ప్రధానంగా దేవుణ్ణి పూజించే వాళ్లు. దేవుణ్ణి ఆరాధించడాన్నే దైవార్చన అంటాం. క్రీస్తూ అతని జ్ఞాన దేహమైన క్రైస్తవులూ కలసి సామాజికంగా తండ్రిని పూజించడమే దైవార్చనం. ఆరాధనలో మనం పూజించేది తండ్రిని. ఈ యారాధనం క్రీస్తుద్వారా ఆత్మశక్తితో జరుగుతుంది. దైవారాధనలో ముగ్గురు దైవవ్యక్తులూ, దైవప్రజలూ కూడ వుంటారు. దైవార్చనలో ముఖ్యవ్యక్తి క్రీస్తు ఆ నామంమీదిగా దప్పితే మరోనామం మీదిగా మనకు రక్షణం లేదు -అచ 4, 12 అతడు మనకు ప్రధాన యాజకుడు. దేవునికీ నరులకూ మధ్య ఏకైక మధ్యవర్తి. అతని విధేయత సిలువ మరణం తండ్రికి అత్యంత ప్రీతి కలిగించింది. కనుక యిప్పడు మన దైవార్చన ఆంతా వుత్థాన క్రీస్తుద్ర్వారా జరుగుతుంది.