పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పూర్వ వేదాన్ని మూడవేల యేండ్లనాడూ నూతవేదాన్ని రెండువేల యేండ్లనాడూ అన్య దేశాల్లో వ్రాశారు. ఐనా భగవంతుడు ఆ గ్రంథాన్ని అన్ని కాలాల వాళ్లకూ అన్ని దేశాల వాళ్లకూ వుపయోగపడేలా వ్రాయించాడు. ෂයි విశ్వవ్యాప్తమైన గ్రంథం. ఈ కాలపు పరిస్థితులకూ సమస్యలకూ కూడ ০ে953 పరిష్కారం దొరుకుతుంది. వాక్యం గ్రంథంలో వుంటే చాలదు, మన హృదయం లోత్రి ప్రవేశించాలి. ఒకసారి హృదయంలోకి ప్రవేశిస్తే అది శిలాక్షరం లాగ గొప్ప ప్రేరణం పుట్టించి శాశ్వతంగా నిల్చిపోతుంది. ప్రార్థనలో మనం దేవునితో మాటలాడతాం. బైబులు పఠనంలో దేవుడే మనతో మాటలాడతాడు. గ్రంథాన్ని భక్తితో చదువుకొని ప్రభువు చెప్పే సందేశాన్ని శ్రద్ధతో వినాలి. మన బైబులు మనకుండాలి. అది పనిముట్టు. అదిలేందే మన జీవితంలో ఆధ్యాత్మికమైన పని జరగదు. ఆచరణ శుద్ధి ముఖ్యం. బైబులు చదువుకొని ఆ గ్రంథం ෂයීජිංඩ්ෆ් ట్లుగా మన జీవితంలోని పొరపాట్లు తప్పిదాలు సవరించుకోవాలి. అద్ధం లోకి చూచుకొని ముఖాన్ని సవరించుకొంటాం. బైబులనే అద్ధంలోకి పారజూచి మన హృదయాన్నీ నడవడికనూ సవరించుకోవాలి -యాకో 1.22-24. అసలు ముఖ్యమైన సమస్య యిక్కడే వుంది. మొదట మనం బైబులు చదువుతాం. అటుతర్వాత బైబులే మనలను చదువుతుంది. అనగా ఆ గ్రంథం మనకు హితవు చెప్పి మనలో మార్పు తెస్తుంది. లౌకికమానవుడు క్రమేణ ఆధ్యాత్మిక నరుడుగా మారిపోతాడు. వీలైనప్పడెల్ల బైబులును ఇతరులకు కూడ బోధించాలి. బోధించడం ద్వారా బైబులు జ్ఞానమూ బైబులు భక్తీ పెరుగుతాయి. మన క్యాతలిక్ సమాజంలో పిల్లలకు జ్ఞానోపదేశం బోధించడంతోనే సరిపెట్టుకొంటారు. కాని జ్ఞానోపదేశం మాత్రమే చాలదు. పిల్లలకు చిన్నప్రాయం నుండే బైబులు కూడ బోధించాలి. పెరిగి పెద్దయ్యాక ఆ గ్రంథమే వాళ్లను దైవమార్గాల్లో నడిపిస్తుంది.