పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేసికొంటాం. ఆత్మే మనచే ప్రార్థన చేయిస్తుంది. ఈ ప్రార్థన మనవి, కృతజ్ఞత, పశ్చాత్తాపం, ఆరాధనం అనే నానా రూపాల్లో వుండవచ్చు. కొంచెం సేపు ప్రార్ధన చేసికొన్న తర్వాత పరాకులు వస్తాయి. అప్పడు మళ్లా పఠనం కొనసాగించి పూర్వం లాగే మూడు మెట్ల క్రమంలో జపం చేసికోవాలి. ఈ పద్ధతిలో మనకున్న కాల వ్యవధిని బట్టి ఎన్ని బైబులు వాక్యాలనయినా, ఎన్నిసార్లయినా ప్రార్థన చేసికోవచ్చు. ఇది బైబులు జ్ఞానాన్ని ఆర్జించే పద్ధతి కాదు. బైబులును ప్రార్ధన ಚೆಸಿಆಣೆ పద్ధతి. ప్రార్థన ముగించాక ఆ ప్రార్థనలోని బైబులు వాక్యం ఒకదాన్ని యెన్నుకొని దాన్ని రోజు పొడుగున చాలసార్లు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దీని ద్వారా బైబులు ధ్యానాన్ని రోజంతా కొనసాగించుకొన్నట్లు ఔతుంది. బైబుల్లో అన్ని భాగాలు ప్రార్థనకు ఉపయోగపడవు. భక్తిమంతమైన భాగలనే ముందుగానే జపానికి ఎన్నుకోవాలి. ఉదాహరణకు యోహాను 15,1-7 వచనాలను గాని, 23వ కీర్తనను గాని అభ్యాసం చేసి చూడవచ్చు. 6. మన బైబులు భక్తి ఇంకా పెరగాలి పూర్వ గురువులూ మఠనకన్యలూ మన ప్రజలకు దేవద్రవ్యాను మానాలపట్లా పునీతుల పట్లా భక్తిని నేర్పారు. ఈ భక్తి మంచిదే కాని యిది చాలదు. బైబులు భక్తి కూడ వుండాలి. సంస్కారాలూ బైబులూ రెండూ ఆధ్యాత్మిక జీవితంలో రెండు కాళ్లలాంటివి. రెండు కాళ్లతో నడిచే వాడే పూర్ణ మానవుడు. బైబులు భాషా, భావాలూ నిరాడంబరంగా వుంటాయి. ఐనా ఆ గ్రంథం భగవంతుడు వ్రాయించింది. అది సముద్రమంత లోతు, కొండంత యెత్తు. కనుక బైబులు చదవడం ఎందుకులే అని నిర్లక్ష్యం చేయకూడదు. మొదటలో పాఠకులకు వాక్యం తీపి తెలియదు. అది చప్పగా వుంటుంది. రుచి తగలదు. కాని చదువుకొని పోయే కొద్ది వాక్యం తేనెలాగ తీయగా వుంటుంది -కీర్త 19,10.