పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కూడ సత్ర్పసాదాన్ని భుజించి దివ్యరక్తాన్ని పానం జేస్తామని వ్రాశారు. గ్రెగొరీ పోపుగారు తిరుసభ అనే వధువుకి దేవుడిచ్చిన కట్నం బైబులు గ్రంథం అని చెప్పారు. క్రీస్తు అనుసరణ గ్రంథం 4,11, 4 ఈలా చెప్పంది. మన దేవాలయంలో రెండు బల్లలు వుంటాయి. ఒకదానిమీద క్రీస్తు శరీరం వుంటుంది. అది మనకు ఆహారం. రెండవ దానిమీద పవిత్ర గ్రంథం వుంటుంది. అది మనకు దీపం. మనం ఈ రెండింటినీ వాడుకోవాలి. వేదశాస్తుల దృష్టిలో వాక్కు కూడ ఓ సంస్కారం లాంటిది. అది జ్ఞానస్నానంలాగ నూత్నజన్మనిస్తుంది. సత్ర్పసాదం లాగ భోజనమాతుంది. పాపసంకీర్తనంలాగ పాపపరిహారం దయచేస్తుంది. విశేషంగా వేదపండితులు సత్ర్పసాదానికీ వాక్కుకీ పోలికలు చెప్పారు. పూజలో ముందుగా వాక్కుని భుజించి తర్వాత సత్ర్పసాదాన్ని భుజించాలి అన్నారు. 5. వాక్యాన్ని ప్రార్థన చేసికొనే విధానం బైబులు చదువుకొని ప్రార్ధన చేసికొనే పద్ధతి వొకంటుంది. దానికి "లెక్సియొు దివీన” లేక భక్తిమంతమైన బైబులు పఠనం అనిపేరు. ఆరవ శతాబ్దంలో బెనడిక్టు భక్తుడు దీన్ని ప్రారంభించాడు అని చెప్తారు. దీనిలో మూడు మెట్లుంటాయి. మొదటిమెట్టు పఠనం. ఇక్కడ బైబుల్లో వొకభాగం చదువుతాం. దానిలో ఒక వాక్యంగాని లేక పదంగాని మన హృదయానికి తగిలి భక్తి పుట్టిస్తుంది. అక్కడ ఆగుతాం. రెండవమెట్టులో ఆ భక్తిని పుట్టించిన వాక్యాన్ని రెండుమూడుసార్లు పునశ్చరణం చేసుకొంటాం. అనగా ఆ వాక్యాన్ని మనకు మనమే మళ్లా మళ్లా చెప్పకొంటాం. దానివల్ల ఆ వాక్యం లోతుగా మన మనసులోగి దిగి హృదయాన్ని బాగా కదిలిస్తుంది. దీనివలన ప్రార్థనకు సిద్ధమౌతాం. మూడవ మెట్టులో ఆ వాక్యాన్ని పురస్కరించుకొని ప్రార్ధన