పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ్రాసికొన్నాడు –యోహా 410. అగస్టీను భక్తుడు రేయి గతించి పగలు సమీపించింది. ఇక చీకటి పనులు మానివేద్దాం అనే బైబులు వాక్యం చదువుకొని పరివర్తనం చెందాడు -రోమా 13, 12. ఎడారి సన్యాసియైన అంతోనిగారు గురువు పూజలో నీ యూస్తి నమ్మి పేదలకు దానం చేయి. ఆ మీదట వచ్చిన ననుసరించు అనే వాక్యాన్ని చదవగా విని సన్యాసిగా మారిపోయారు. తర్వాత అసిస్సీ ఫ్రాన్సీసుగారికి కూడ ఇదే వాక్యం ప్రేరణం పుట్టించింది -మత్త 19,21. అవిలాపురి పెద్దతెరేసమ్మగారు దేవా! నీవు సమరయ స్త్రీకి ఇస్తానన్న జీవజలం నాకు కూడ దయచేయి అని ప్రార్థించేది. -యోహా 4,10. చిన్న తెరేసమ్మగారిని మీరు పసిబిడ్డల్లాగ మారితేనే గాని దైవరాజ్యంలో చేరరు అనే వాక్యం కదిలించింది. ఆమె అభ్యాసం చేసిన చిన్ని మార్గానికి ఆధారం ఆ వాక్యమే -మత్త 18, 3. ఇంకా చాలమంది పునీతులు బైబులు వల్ల ప్రబోధం చెంది దైవమార్గాన్ని యెన్నుకొన్నారు. 4. వేదశాస్రుల భావాలు మత్తయి 13,44లో పొలంలో దాగివున్న నిధి అనే సామెత వస్తుంది. ఈ సామెత మీద వ్యాఖ్య చెపూ జెరోము భక్తుడు బైబులు అనే పొలంలో క్రీస్తు అనే నిధి దాగి వుంది. మనం బైబులు చదువుకొని క్రీస్తనే నిధిని ఎత్తి తీసికోవాలి అని చెప్పాడు. క్రిసోస్తం భక్తుడు ఈ లోకంలో ప్రవాసంలో వున్న బిడ్డలమైన మనలను వోదార్చడానికి పరలోకంలోని తండ్రి వో జాబు వ్రాసి పంపాడు. ఆ జాబే బైబులు గ్రంథం. తల్లిదండ్రుల జాబును పిల్లలు ప్రీతితో చదివినట్లుగా మనం బైబులు గ్రంథాన్ని చదవాలి అని నుడివాడు. అగస్టీను గారు సువార్త క్రీస్తు కంఠం అన్నారు. రెండువేల యేండ్లనాడు క్రీస్తు ఆయా నగరాల్లో గొంతెత్తి బోధించినట్లు అగా ఇప్పడు బైబులు నుండి గూడ బోధిస్తాడని భావం. ఇంకా ఆ భక్తుడు వాక్కుమరో మనుష్యావతారం అని వాకొన్నాడు. అనగా వాక్కుని పఠించినప్పుడెల్ల క్రీస్తు మళ్లా మన హృదయాల్లో జన్మిస్తాడని భావం. ఆంబ్రోసుగారు మనం దివ్యగ్రంథం నుండి