పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తల్లిమరియు క్రీస్తు పలుకులను హృదయంలో పదిలపరచుకొని ధ్యానం చేసికొంది. గొర్రెల కాపరులు దేవదూత సందేశాన్ని విని అపరాత్రిలో క్రీస్తు శిశువుని ఆరాధించడానికి వచ్చారు. మరియు ఈ సంఘటనను తన హృదయంలో పదిలపరచుకొని దాన్ని గూర్చి ఆలోచించి చూచుకొంది - లూకా 2,19. ఈలాగే క్రీస్తు బాలుడు యెరూషలేములో నేను నా తండ్రి పనిలో నిమగ్నుజ్ఞయి వుండవద్గా అన్నాడు. ఆ తండ్రి యెవరు, ఆ తండ్రి పని యేమిటి అని మరియ సుదీర్ఘంగా తలపోసింది -251. ఈ మరియలాగే మనం కూడ బైబులు వాక్యాన్ని పరిశీలించి చూచుకోవాలి. భక్తితో మననం చేసికోవాలి. వాక్కు విత్తనంలాగ హృదయంలో ত০১ మొలకెత్తాలి. ఇంకా, బెతానియా మరియ ప్రభువు పాదాలచెంత కూర్చుండి అతని బోధను శ్రద్ధతో ఆలించింది. ఇక్కడ పాదాలచెంత కూర్చోవడమంటే శిష్యురాలు కావడం. ప్రభువు ఇప్పడు కూడ గ్రంథంలో వుండి మనకు బోధచేస్తాడు. మనం ఆ బోధను భక్తితో వినాలి -లూకా 10,39. గురువు బోధను జాగ్రత్తగా విని అర్థం జేసికొనివాడే మంచి శిష్యుడు. 3. భక్తుల పఠనాభ్యాసం తిమోతి చిన్ననాడే అమ్మమ్మ లోయి వొడిలో కూర్చుండి పూర్వవేదం నేర్చుకొన్నాడు –2తిమో 1,5. అతడు బాల్యం నుండి లేఖనాలను చదువుకోవడానికి అలవాటు పడినవాడు -3,15. ప్రాచీన క్రైస్తవులు రబ్బయుల పద్ధతిని అనుసరించి వేదగ్రంథ భాగాలను రొమ్ముమీద తాయెత్తుల్లాగ ధరించేవాళ్లు. ప్రాచీన క్రైస్తవులు సత్ర్పసాదంతోపాటు బైబులు గ్రంథాన్ని కూడ ప్రదక్షిణల్లో ప్రదర్శిస్తూ తీసికొని పోయేవాళ్లు. భక్తుడు అంతియోకయా ఇగ్లేష్యసు గారు రెండవ శతాబ్దంలో రోములో వేదసాక్షిగా మరణించాడు. ఆయన తన మరణాన్ని గూర్చి చెప్పకొంటూ ఇగ్లేష్యసూ! నీవు తండ్రి వద్దకు రా జీవజలం నన్ను పిలుస్తూంది అని