పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనకు వాక్యం బోధిస్తుంటే మన హృదయం ప్రజ్వరిల్ల లేదా అనుకొన్నారు. వాక్యాన్ని వినడం వల్ల మన హృదయాలు కూడ అగ్నిలా మండుతాయి - లూకా 24,32 ప్రభువుకి అతని గొర్రెలు తెలుసు. ఆ గొర్రెలకు కూడ ప్రభువు తెలుసు -యోహా 10,15. ప్రభువు వాక్కు నిత్యజీవాన్ని దయచేస్తుంది. పేతురు క్రీస్తుతో నిత్యజీవమిచ్చే పలుకులు నీ నుండి వెలువడుతున్నాయి అని పల్కాడు - యోహా 6,68. పూర్వం ఆమోసు ప్రవక్త ప్రభువు వాక్యుకే కరువు వస్తుంది అని పల్మాడు -8, 11. ఇది శాపవాక్యం. ఈ శాపం మనకు తగలకూడదు. క్రైస్తవ భక్తుడు రోజూ కాసేపు వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసికోవాలి. వాక్యాన్ని చదువుకోవడం పాటించడం కష్టమేమీ కాదు. అది మనకు దగ్గరగానే మన హృదయాల్లోనే వుంటుంది. వాక్యాన్ని పాటిస్తే మేలు, పాటించకపోతే కీడు. దాన్ని పాటిస్తే జీవం, పాటించకపోతే మరణం. దాన్ని పాటిస్తే ఆశీస్సు, పాటించకపోతే శాపం -ద్వితీ 30,19. 2. బైబులు పఠనానికి ఆదర్శమూర్తులు సమూవేలు పసిపిల్లవాడు. షిలో దేవళంలో దేవుడు పిలువగా ప్రభూ! నీ దాసుడు ఆలిస్తూనే వున్నాడు సెలవీయి అని పల్కాడు –2సమూ 3,10. ఇప్పడు గూడ గ్రంథంలో వుండి దేవుడు మనతో మాటలాడతాడు. మన తరపున మనం అతని పలుకులు వినడానికి సిద్ధంగా వుండాలి. కీర్తనకారుడు నీవు నా కండ్లు తెరువు, అప్పడు నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుత విషయాలు గ్రహిస్తాను అని వాకొన్నాడు -119,18. మనంతట మనం దేవుని వాక్కుని గ్రహించలేం. ప్రభువే మనకు జ్ఞానోదయాన్ని కలిగించి వాక్కుని అర్థంజేసి కొనేలా చేస్తాడు. మనకంటి పొరలు తొలగించి దివ్యదృష్టిని ప్రసాదిస్తాడు. దేవుని ఆత్మ వాక్కుని అర్థంజేసికొనేశక్తినీ పాటించే శక్తినీ ప్రసాదిస్తుంది. మనం ఆ యాత్మ అనుగ్రహాన్ని అడుగుకోవాలి.