పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేహానికి అన్నం అవసరం. ఆత్మకు జపం అవసరం. శరీరానికి ప్రాణం గాలి. ఆత్మకు ప్రాణం జపం. మొక్కకు నీళ్లు అవసరం. భక్తునికి జపం అవసరం. ప్రార్ధన పూలతోట లాంటిది. రోజూ పరామర్శిస్తేనే గాని అది పూలు పూయదు ప్రార్ధన బ్రహ్మచర్యాన్ని కోటలాగ కాపాడుతుంది. పర్యవసానం ఏమిటంటే, ప్రార్థనలో ఆరితేరని నరుడు పవిత్రుడు కాలేడు. 8. వాక్యభక్తి మన క్యాతలిక్ సమాజంలో వాక్యభక్తి అంతగా వుండదు. పూర్వ గురువులు మన ప్రజలకు వాక్యభక్తిని నేర్పలేదు. ఇప్పడు మనం ప్రయత్నం జేసి ఈ భక్తిని పెంపొందించుకోవాలి. ఇక్కడ ఆరంశాలు పరిశీలిద్దాం. 1. వాక్యం విలువ నరుల వాక్కు మనకు సమాచారాన్ని అందిస్తుంది. అది మనలను ఉత్సాహపరుస్తుంది. ప్రోత్సహిస్తుంది, హెచ్చరిస్తుంది. మనకు సానుభూతిని తెల్పుతుంది. దేవుని వాక్కు కూడ ఈ పనులన్నీ యింకా అధికంగా చేసి పెడుతుంది. బైబులు వాక్కుకి హీబ్రూ భాషలో డాబార్ అనీ గ్రీకులో లోగోస్ అనీ పేర్లు. ఈ వాక్కు కేవలం మాట మాత్రమే కాదు, శక్తితో పని చేసే క్రియ కూడ. ఆదిలో దేవుడు వెలుగు కలగాలి అని పలకగానే వెలుగు పుట్టింది -ఆది 1,3. వాక్కు పనిచేసిపెట్టేది. పూర్వం పవిత్రాత్మ కొందరు భక్తులను ప్రేరేపించి వాళ్లచే పవిత్ర గ్రంథాలు వ్రాయించింది -2పేత్రు 1,21. ఇప్పడు పాఠకులకు కూడ ఒక విధమైన ప్రేరణం పుడుతంది. ఆత్మ ప్రేరణం ඒථයී బైబులు వాక్కుమనకు అర్థం కాదు. కనుక భక్తుడు గ్రంథపఠనానికి ముందు ప్రార్ధన చేసికోవాలి. టైబులు దేవుని వాక్కుకి చాల వుపమానాలు వాడుతుంది. అది