పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జపాన్ని కొనసాగించాలి. పరాకులను ప్రయత్నం చేసి గెంటివేయాలి. ఇంత చేసినా కొన్నిసార్లు వాటిని వదలించుకోలేం. 3) ప్రార్ధనవల్ల మనలో కలిగే మార్పు జపం వెంటనే కాకపోయినా క్రమేణ మనలో మార్పు తెస్తుంది. కొలిమిలో పెట్టిన యినుపముక్క తానూ నిప్పగా మారిపోతుంది. ఆలాగే దేవునికి ప్రార్థన చేసికొనే కొద్దీ దేవునిలోకే మారిపోతాం. జపం వల్ల దేవుణ్ణి లోతుగా అర్థంజేసికొంటాం. అతనికీ మనకూ తండ్రీ బిడ్డ సంబంధం ఏర్పడుతుంది. అతన్ని నమ్మడం, ఆశ్రయించడం నేర్చుకొంటాం. దైవానుభూతి పెరుగుతుంది. జపం వల్ల మనస్వార్థం తగుతుంది. అక్కరలో వున్నవారికి పేదసాదలకూ సహాయం చేయాలనే ಬುದ್ಧಿ పుడుతుంది. మనకున్న కొద్దో గొప్పో తోడివారితో పంచుకొంటాం. ఎదుటివాళ్లను అంగీకరించి ఆదరంతో చూస్తాం. సోదరప్రేమలో వృద్ధి చెందుతాం. మన పనులను నిజాయితీతో చేస్తాం. మన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాం. జీవితంలో ఎదురయ్యే సమస్యలనూ వొడుదుడుకులనూ వోర్పుతో భరిస్తాం. శత్రువులను క్షమిస్తాం. దైవచిత్తానికి లొంగుతాం. అన్ని సంఘటనల్లోను దేవుని హస్తాన్ని గుర్తిస్తాం. లౌకిక నరులంగా వున్న వాళ్లం ఆధ్యాత్మిక నరులుగా మారిపోతాం. ప్రార్థన ఎంత యొక్కువగా వుంటుందో ఈ మార్పు కూడ అంత అధికంగా వుంటుంది. 4) ప్రార్థనకు ఉపమానాలు భక్తులు ప్రార్థనకు చాల వుపమానాలు చెప్పారు. ఇక్కడ కొన్నిటిని విలోకిద్దాం. ప్రార్ధన నిచ్చెనలాంటిది. దానిద్వారా దేవుని దగ్గరికి ఎక్కిపోతాం. అది మోక్షంలోని ఏ గదినైనా తెరచే అద్భుతమైన తాళపుచెవి. అనగా దానిద్వారా ఏ వరప్రసాదాన్నయినా పొందవచ్చు.