పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రీస్తు అడగండి, దేవుడు మీకిస్తాడు అని చెప్పాడు -మత్త 7,7. అడగందే దేవుడు వరాలీయుడు. ఇంకా ప్రభువు, మీరు శోధనలో పడకుండడానికి జపం చేయండి అన్నాడు -మత్త 26, 41. జపం లేకపోతే సులువుగా శోధనల్లో చిక్కుకొని నాశమైపోతాం. ప్రార్ధన మనలోని దుష్టప్రవృత్తిని తొలగించి మనలను సజ్జనులనుగా మారుస్తుంది. అది లేకపోతే ఇంకా దుషులమైపోతాం. లోకవస్తువుల వల్ల కాక ప్రార్ధనవల్ల హృదయం శాంతిస్తుంది. ఇన్ని కారణాలవల్ల ప్రార్థన అత్యవసరం. అదిలేందే మోక్షప్రాప్తి లేదు. 2) పరాకులు ప్రార్థనకు పూనుకోగానే పరాకులు వచ్చిపడతాయి. మనసు దేవుని మీద నిలువక లోకవస్తువుల మీదికి వెళ్లిపోతుంది. కోతి ఒక కొమ్మమీద నిలువదు. మన మనసుకూడ అంతే. కొందరికి లోకవ్యామోహాలు మెండుగా వుంటాయి. ಓಬು, స్నేహితులు, సుఖభోగాలు పేరుతెచ్చుకోవడం మొదలైన విషయాల్లో తలమునులైవుంటారు. ఈలాంటి వాళ్లకు పరాకులు ఎక్కువగా వస్తాయి. అందరికీ పరాకుల బెడడ యెంతో కొంత వుంటుంది. వాటిని పూర్తిగా వారించలేం. మామూలుగా పరాకులు వచ్చినప్పడు మన అంతరాత్మ తెలియజేస్తుంది. మనసు దేవునిమీద లేదని గుర్తిస్తాం. ఆలా గుర్తించిన వెంటనే వాటిని వదలించుకొనే ప్రయత్నం చేయాలి. ఈ సమయాన్నిదేవునికి ఈయాలిగాని వ్యర్థమైన ఆలోచనలకు ఈయకూడదు అనుకోవాలి. ఎన్నిసార్లు పరాకులు వస్తాయో అన్నిసార్లు వాటిని నెట్టివేయాలి. ప్రార్థనలో దైవసాన్నిధ్యాన్ని గాఢంగా గుర్తుకు తెచ్చుకోవాలి. మనం దేవుని యెదుట వున్నాం, అతడు మనలను గమనిస్తున్నాడు అనుకోవాలి. భక్తుడు ఆ ప్రభువు వైపు చూచి మనలను వేధించే పరాకులను తొలగించమని మన ప్రార్థనను సఫలం చేయమని విన్షయంతో అడుగుకోవాలి. దృఢచిత్తంతో