పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అతన్ని స్తుతిస్తుంటారు –యెష 6, 3. త్రిత్వస్లోత్రం, మహిమగీతం ఆరాధన ప్రార్థనలే. పైన పేర్కొన్న నాలురకాల జపాల్లో కొంత స్వార్థం వుంటుంది. ఏ స్వార్ధం లేనిది ఆరాధన జపం వొక్కటే. జపాలన్నిటిలోను ఇది శ్రేష్టమైంది. కనుక వీలైనప్పడెల్ల ఈ ప్రార్థన చేసికోవాలి. వేరువేరు రంగుల బట్టలు ధరిస్తాం. వేరువేరు కూరలు భుజిస్తాం. ఆలాగే సందర్భాన్నీ అవసరాన్నీ బట్టి వేరువేరు ప్రార్థనలు చేసికోవాలి. 4. ప్రార్థనతో అవసరం కొంతమంది ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తారు. అది లేందే రక్షణం లేదు. బండిచక్రం మధ్యలో ఇరుసు వుంటుంది. చక్రం నిరంతరం ఆ యిరుసు చుటూ తిరుగుతూంటుంది. ఆలాగే భక్తుని జీవితమంతా ప్రార్థన చుటూ తిరుగుతూండాలి. 1) ఆవశ్యకత క్రీస్తు జీవితంలో ప్రార్థనా పనీ కలసి పోతుండేవి. అద్భుతాలు, బోధలూ, ప్రార్థనా కలగలుపుగా వుండేవి. మన జీవితంలో గూడ పనీ ప్రార్థన కలసి పోతుండాలి. ప్రభువు పవిత్రగ్రంథంలోని పలుకుల ద్వారా మనతో మాటలాడతాడు. మనం కూడ ప్రార్ధన ద్వారా అతనితో మాటలాడాలి. సంభాషణం రెండువైపుల నడవాలి. జపం లేకపోతే లోకవ్యామోహాల్లో కూరుకొనిపోతాం. అసలు దేవునివైపు మనసు త్రిప్పలేం. మంటి మానవుడు మంటికి అంటిపెట్టుకొని వుండిపోతాడు. ప్రార్థనలేందే వరప్రసాదాన్ని పొందలేం. వరప్రసాదం లేందే రక్షణం లేదు కనుక రక్షణకు జపం అవసరమని భక్తుడు అల్ఫోన్ససు లిగోరిగారు అభిప్రాయపడ్డారు.