పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4) కృతజ్ఞతా ప్రార్ధనం దేవుడు మనకు చేసే వుపకారాలు ఆకాశంలోని చుక్కల్లాగ, సముద్రం వొడ్డున వున్న యిసుక రేణువుల్లాగ అంసఖ్యాకంగా వుంటాయి. వాటికన్నిటికీ కృతజ్ఞత తెలుపుకోవాలి. క్రీస్తు పదిమంది కుష్టరోగులకు వ్యాధి నయం జేయగా వొక్కడు మాత్రం తిరిగి వచ్చి నమస్కారం చెప్పాడు. ప్రభువు తతిమ్మా తొమ్మిదిమంది యేరీ అని అడిగాడు. దీన్ని బట్టి అతడు మనం కృతజ్ఞతా ప్రార్ధన చేయాలని కోరుకొంటాడని అర్థం జేసికోవాలి -లూకా 17, 17. భగవంతుడు మనకు నీరు, గాలి, పైరుపంటలు మొదలైన ప్రాకృతిక వరాలిచ్చాడు. క్రైస్తవ విశ్వాసం, బైబులు సంస్కారాలు, మరిమయాత పునీతులు మోక్షభాగ్యం మొదలైన ఆధ్యాత్మిక వరాలిచ్చాడు. Hඩ්ෂීඝණ්, విద్య డిగ్రీలు ఉద్యోగం, కుటుంబం మొదలైన వ్యక్తిగత వరాలిచ్చాడు. అసలు మనకున్నవన్నీ దేవుడిచ్చినవే కదా! వీటన్నిటికీ వందనాలు చెప్పకోవాలి. ప్రభువు వుపకారాలు వేటిని మరవకూడదు -కీర్త 103,2 తోడినరులు వుపకారం చేస్తే వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. దేవునికి ఇంకా అధికంగా వందనాలు చెప్పాలి. ఐనా చాలమంది దేవుణ్ణి అదీయి ఇదీయి అని దబాయిస్తారే గాని ఇచ్చినవాటికి నమస్కారం చెప్పరు. ఇది మొరటుతనం. పొగరుబోతులకు కృతజ్ఞతాభావం వుండదు. నేను మొనగాణ్ణి అని విర్రవీగుతుంటారు. వినయాత్ముడు నేను దేవుని చలవవల్లనే యింతటివాణ్ణి అయ్యాననుకొని నమస్కారం చెప్తాడు. 5) ఆరాధనం నరులవన్నీ దుర్గుణాలు. కాని భగవంతుడు కల్యాణగుణాలు కలవాడు. అతడు మంచివాడు, దయగలవాడు, పరమపవిత్రుడు. అతడు మనకు ఏదో చేశాడని కాదు, అతని యోగ్యతను బట్టే అతన్ని స్తుతించాలి. ఇదే ఆరాధన ప్రార్థన. దేవదూతలు నిఙ్య ప్రభువు పవిత్రుడు అని పాడుతూ