పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

చేయాలి. ఎప్పుడూ మనకొరకు మనం జపిస్తే నా చిన్ని బొజ్ఞకు శ్రీరామరక్ష అన్నట్లుగా వుంటుంది. విజ్ఞాపనం గొప్ప సేవ, గొప్ప దానం. 3) పశ్చాత్తాపజపం నరులు పాపులు. భగవంతుడు పాపాన్ని ఏమాత్రం సహించని పరమ పవిత్రుడు. సత్యం అబద్ధాన్ని అంగీకరించదు కదా! కనుక దేవుని యెదుట నిజాయితీతో పశ్చాత్తాపపడాలి. తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు తిరిగివచ్చి నేను నీకూ దేవునికీ విరోధంగా పాపం చేశాను అని పరితపించాడు -లూకా 15,21. శరీరం మురికైపోతే స్నానం చేసుకొని శుద్ధిని పొందుతాం. ఆలాగే రోజూ చేసే పాపాల వలన ఆత్మకూడ మలినమై పోతుంది. దాన్ని పశ్చాత్తాపం ద్వారా నిర్మలం చేసికోవాలి. పాపం విషం లాంటిది. దాన్ని వెంటనే కకేసుకోవాలి. దేవుడు పరిశుధుడు. అతడు పాపిని అసహ్యించుకోడు గాని పాపాన్ని తప్పక ఏవగించుకొంటాడు. పాపసంబంధమైనది ఏదికూడ అతని సన్నిధిలోకి రాలేదు. మన పాపాలు చాల రకాలుగా వుంటాయి. చేయవలసిన పనులు చేయం. చేయగూడనివి ఎగిరెగిరి చేస్తాం. ఏవేవో దురభ్యాసాల్లో చిక్కుకొంటాం. ఒక్కొక్కరికి ప్రత్యేకమైన బలహీనతలు కూడ వుంటాయి. అసూయ, మోహం మొదలైన సప్తవ్యసనాలు కూడ వుంటాయి. దేవుణ్ణి పట్టించుకోం. వీటన్నిటికొరకు పశ్చాత్తాపపడాలి. భగవంతుడు పరితాపప్రియుడు. క్రీస్తు నేను రోగులకొరకు వచ్చిన వైద్యుణ్ణి అని పల్కాడు -లూకా 5,31. కనుక దేవుని సమక్షంలో పశ్చాత్తాపపడ్డానికి ఎప్పుడూ సిద్ధంగా వుండాలి. ఐనా చాలమంది పశ్చాత్తాప ప్రార్ధన చేయరు. నేను చేసినవి చిన్న తప్పలేకదా అనుకొని ధీమాగా వుండిపోతారు. ఈ మనస్తత్వం మనకు తగదు.