పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కన్పించినప్పడు మన ప్రార్ధనం ఫలించినట్లు. వట్టినే నేను జపం చేశాను అనుకొంటే చాలదు. 8. ఐదు రకాల ప్రార్థనలు ప్రార్థనేమో వొక్కటే. లోతుగా అర్థంజేసికోవడానికి భక్తులు దాన్ని ఐదురకాలుగా విభజించారు. వేరే విభజనలు కూడ వున్నాయి. 1) మనవి జపం నరుడు అక్కరలో వుండి దేవునికి మనవి చేస్తాడు. ఓ బిచ్చగాడిలాగ దేవుణ్ణి అర్ధిస్తాడు. దేవుడు అమ్మానాన్న లాంటివాడు కనుక మన మనవిని విని సహాయం చేస్తాడు. తుఫానులో చిక్కిన శిష్యులు క్రీస్తుకి మొరపెట్టగా అతడు తుఫానుని అణచివేసి వారిని కాపాడాడు - మత్త 8,25. ఇది ప్రాథమికమైన ప్రార్ధనం. చాలమంది చేసేది కూడ యీ జపాన్నే మన మనవులను చూచి దేవుడు విసుగు చెందడు. మన బాధలు అతనికి తెలుసు. మనం తన్నడగాలనే కోరుకొంటాడు. తనకు న్యాయం చేయమని వితంతువు అన్యాయపు న్యాయాధిపతిని మాటిమాటికి పీడించింది కదా? -లూకా 18, 5. కనుక మళ్లా మళ్లా దేవుణ్ణి అడుగుకోవడానికి మనమేమీ సందేహించకూడదు. కాని యెప్పడూ మనవి ప్రార్థనే చేసుకొంటూపోతే స్వార్ధం పెరిగిపోతుంది. 2) విజ్ఞాపనజపం ఇతరుల అవసరాలు తీర్చమని జపించడమే విజ్ఞాపనం. అబ్రాహాము సొదొమ గొమర్రా పట్టణాలను క్షమించమని ప్రార్థించాడు -ఆది 18. మనం ప్రార్ధన చేయవలసినవాళ్లు చాలమంది వుంటారు. బంధువులు, ఉపకారం చేసినవాళ్లు మతాధికారులు, శత్రువులు పాపాత్ములు, ఉత్తరించే స్థలంలోని ఆత్మలు మొదలైనవాళ్లందరికొరకు ప్రార్థించాలి. ఆలాగే సకాల వరాలు, పైరుపంటలు శాంతి, దేశసమస్యలు మొదలైన వాటికొరకు వేడుదల L