పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంకా జపాన్ని గూర్చి భక్తులు చెప్పిన నిర్వచనాలు చాల వున్నాయి. వాటి సారాంశం ఇది. పసిబిడ్డ తల్లిదండ్రుల మీద ఆధారపడినట్లే దేవునిమీద ఆధారపడి నమ్మకంతో అతన్ని అడుగుకోవడం ప్రార్ధనం అన్నమాట. 2. ప్రార్థనా సూత్రాలు ప్రార్థనలో చాల అంశాలున్నాయి. అన్నిటిని కాకసోయినా కొన్ని విషయాలనైనా కొంచెం విపులంగా తెలిసికోవాలి. ఇక్కడ ప్రార్థనా సూత్రాలు కొన్నిటిని పరిశీలిద్దాం. ప్రార్థనకు ముందు దైవసాన్నిధ్యాన్నికలిగించుకోవాలి. సాన్నిధ్యమంటే మనం దేవుని ముందు వున్నామని భావం. ప్రార్థనలో దేవుడు మనలను గమనిస్తుంటాడు. అతడు పరమపవిత్రుడు, దేవదూతలు కొలిచే ప్రభువు. కనుక అతని యెదుట మనం మేరమర్యాదలతో భయభక్తులతో మెలగాలి. పెద్ద అధికారుల యెదుట వినయంగా వుంటాం. కాని అధికారులందరికీ పై యధికారి దేవుడు. కనుక అతని సమక్షంలో ఇంకా యొక్కువ వినయంతో మెలగాలి. ఆ ప్రభువు మనలను దీవించి మనకు ప్రార్ధన చేసికొనే శక్తిని దయచేస్తాడు. ఈ సాన్నిధ్యభావం భక్తిగా జపం జేసికోవడానికి వుపయోగ పడుతుంది. ప్రార్థన ఎవరికి చేస్తాం? ముగ్గురు దైవవ్యక్తులకు కూడ. తండ్రికి ప్రార్థన చేస్తాం. అతడు సర్వానికి అధికారి. క్రీస్తుద్వారా ప్రార్థన చేస్తాం. మనలను రక్షించింది అతడే. ఆత్మసహాయంతో ప్రార్ధన చేస్తాం. జపం చేసేశక్తిని ఇచ్చేది ఆత్మడే. దైవార్చనమంతా క్రీస్తుద్వారా, ఆత్మశక్తితో, తండ్రిని స్తుతించడమే -ఎఫె 2, 18. ఇంకా సన్మనస్కులకూ, పునీతులకూ కూడ ప్రార్థన చేయవచ్చు. ప్రార్ధనం మన పనికాదు, దేవుని పని. మనంతట మనం జపం చేయలేం. దేవుడే మనచే ఆ పని చేయిస్తాడు. జపాన్ని మొదలు పెట్టించేదీ, కొనసాగించేలా చేసేదీ, మంపజ్ఞ్యవ దేవుడే. కనుక ఓ ప్రభూ!