పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధ్యాత్మిక జీవితమంటే ప్రధానంగా ప్రార్థనా జీవితమే. జపం ద్వారా దేవునితో ఐక్యమై ఆ ప్రభువుని అనుభవానికి తెచ్చుకొంటాం. నరుడు దివ్యడుగా మారిపోతాడు. ఇప్పడు మన ప్రజల్లో ప్రార్థనాభ్యాసం క్రమేణ పెరుగుతూంది. ఇది హర్షించదగిన విషయం. ఇక్కడ నాల్గంశాలు పరిశీలిద్దాం. 1. ప్రార్ధనం అంటే యేమిటి? జపాన్ని గూర్చి కొన్ని స్పష్టమైన భావాలు వుండాలి. అసలు ప్రార్థనమంటే యేమిటి? ఈ ప్రశ్నకు జపానుభవంగల ప్రాచీన భక్తులు చాల విధాలుగా జవాబు చెప్పారు. కొందరు భక్తులు దేవునితో సంభాషించడమే ప్రార్ధనం అన్నారు. రోజువారి జీవితంలో తోడిజనంతో మాటలాడతాం. ఆలాగే జపంలో దేవునితో మాటలాడతాం. మన అక్కరలూ అవసరాలూ ఆ ప్రభువుకి తెలియజేసికొంటాం. కాని మనం మాటలాడే టప్పడు ఎదుటి నరులను చూచినట్లుగా భగవంతుణ్ణి కంటితో చూడలేం. అతని స్వరాన్ని చెవులతో వినలేం. ఇంకా కొందరు అనుభవజ్ఞలు ప్రార్థనమంటే మనసు దేవునివైపు త్రిప్పకోవడం అని చెప్పారు. మనస్సుని లోక విషయాలనుండి మరల్చి దేవునివైపు త్రిప్పితే ప్రార్థనమౌతుంది. దేవుడు స్వర్గంలోను మన హృదయంలోను కూడ వుంటాడు. మనకు దూరంగాను దగ్గరగాను వుండే దేవుణ్ణి గుర్తుకు తెచ్చుకొని అతనికి మన కష్టసుఖాలను తెలియజేసికోవడమే ప్రార్ధనం. వేరుకొందరు దేవుని నుండి ఉచితమైన వరాలను అడుగుకోవడమే ప్రార్ధనం అన్నారు. ఈశ్వరుడు అన్ని విధాల గొప్పవాడు. నరులమైన మనం అల్ప ప్రాణులం. ఏవేవో యిబ్బందుల్లో చిక్కుకొని దేవునికి మొరపెడతాం. అయ్యా! నన్ను కరుణించు అని వ్రేడ్లు క్రొంటాం. అదే ప్రార్ధనం.