పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆత్మప్రబోధాలను పాటిస్తాం. మన ఆధ్యాత్మిక జీవితం విశేషంగా ఆత్మ ప్రబోధాల మీదనే ఆధారపడి వుంటుంది. దేవుని బిడ్డలను దేవుని ఆత్మే నడిపిస్తుంది -రోమా 8,14. అంతర్నివాసం గొప్ప వరప్రసాదభాగ్యం. దాని వలన మనం దైవకుటుంబానికి చెందినవాళ్లమూతాం. దేవుని భాగ్యాల్లో పాలుపొందుతాం. దివ్యలంగా మారిపోతాం. పునీతులూ భక్తులూ తమ హృదయంలోనే వసించే దేవుణ్ణి ప్రత్యక్షంగా అనుభవానికి తెచ్చుకొని భక్తిభావంతో పులకించి పోయారు. తన్మయులయ్యారు. వారి యంతగా గాకపోయినా మనం గూడ కొంతవరకైనా మన హృదయంలోని దేవుణ్ణి గుర్తించి నిర్మలంగాను ఆనందంగాను జీవించాలి. గ్రెగొరీ నాసియాన్సస్ భక్తుడు నేను అల్పప్రాణిని, మహత్తర ప్రాణినీ కూడ. మృత్యువు వాత బడేవాణ్ణి, అమరుజ్జీ కూడ. ఈ లోకవాసినీ, దైవపురంలో అడుగుపెట్టేవాడ్డీ కూడ. ఎంత వింత అని వాకొన్నాడు. దేవుని వరప్రసాదం ద్వారానే మనకు ఈ భాగ్యాలన్నీ లభిస్తాయి. పెద్దలియో పోపుగారు ఈలా వ్రాశారు. "ఓ క్రైస్తవుడా! నీ ఘనతను గుర్తించు. దైవస్వభావంలో పాలుపొందిన నీవు పాపంలో పడిపోయి దిగజారిపోవడ్డు. నీవు ఏ శిరస్సుకి ఏ దేహానికి అవయవానివో జ్ఞప్తికి తెచ్చుకో. నీవు చీకటినుండి వెలుపలికి వచ్చి దైవరాజ్యపు వెలుగులో ప్రకాశిస్తున్నావు. జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మకు ఆలయమయ్యావు. అంతగొప్ప అతిధిని పాపంద్వారా నీ హృదయంనుండి తరిమివేయవద్దు. మరల పిశాచానికి బానిసవుకావద్దు. క్రీస్తు తన అమూల్యమైన రక్తంతో నిన్ను విమోచించాడు. కరుణతో నిన్ను రక్షించిన దేవుడు ఒకరోజు నీకు తీర్పుతీరుస్తాడు సుమూ” ఈ వాక్యాలు చాలసార్లు మననం చేసుకోదగ్గవి. L