పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తండ్రీ యిద్దరూ మనలో నివాసం ఏర్పరచుకొంటారు –యోహా 14.23. కాని పిత మనలో వుండి ఏం చేస్తాడు? మనలను క్రీస్తు చెంతకు ఆకర్షిస్తుంటాడు -యోహా 6,42. ఈ యాకర్షణ వల్లనే మనం క్రీస్తుని విశ్వసిస్తున్నాం. పిత తన జీవాన్ని క్రీస్తుకి అందిస్తాడు. క్రీస్తు జీవంలో మనం కూడ పాలుపొందాలని కోరుకొంటాడు. అందుకే మనలను క్రీస్తు చెంతకు ఆకర్షించేది. క్రీస్తు, తండ్రితోపాటు పవిత్రాత్మకూడ మన హృదయంలో వసిస్తుంది. పౌలు భక్తుడు కొరింతు సమాజంలో ఆత్మ వుమ్మడిగా వసిస్తుందని చెప్పాడు -1కొరి 3,16. మళ్లా ఒక్కొక్కరిలో కూడ ఆత్మ వ్యక్తిగతంగా వసిస్తుందని వాకొన్నాడు –6, 19. పూర్వవేద దేవాలయంలో దేవుడు షెకీనా రూపంలో వసించాడు. నూతవేదంలో మన హృదయమే దేవాలయం. ఈ హృదయ దేవాలయంలోనే ఆత్మ నివసిస్తుంది. ఈ యాత్మ మనలో వుండి మనకు ప్రేమశక్తిని ప్రసాదిస్తుంది -రోమా 5, 5. దీని వల్లనే మనం దేవుణ్ణి తోడినరులనూ గూడ ప్రేమించగలుగుతున్నాం. పౌలు కొరింతీయులకు వ్రాసూ తండ్రిపేవు, క్రీస్తు కృప, ఆత్మసహవాసం మీతో వుండాలని దీవించాడు -2కొరి 13, 14. ఈ వాక్యం ముగ్గురు దైవవ్యక్తులు మనలో వసిస్తున్నారని తెలియజేస్తుంది. అంతర్నివాసం చాల ఫలితాలనిస్తుంది. దాని ద్వారా పితకు మనతో వున్న పుత్రత్వం బలపడుతుంది. క్రీస్తు మనకు పెద్దన్న ఔతాడు. అతడు మనకు నాయకుడై పిత యింటికి నడిపించుకొనిపోతాడు. మనం క్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధిస్తాం. ఆత్మ మన హృదయాలకు ప్రబోధం కలిగిస్తుంది. యూదులు రాతి పలకలమీద వ్రాయబడిన పదియాజ్ఞల్లు పాటించారు. నూత్నవేదంలో మనం