పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేవునికి విరోధులమైన మనలను అతనికి మిత్రులనుగా తయారుచేస్తుంది. అతనికి ప్రీతిపాత్రులను చేస్తుంది. మన అంతరంగాన్ని మార్చి మనలను నీతిమంతులను చేస్తుంది. పూర్వం దేవుడు అబ్రాహాముతో నీవు భయపడకు. నేను నిన్ను డాలులాగా కాపాడతాను. నీకు గొప్ప బహుమతినియిస్తాను అని చెప్పాడు -ఆది 15,1. ఇప్పడు వరప్రసాదాన్ని పొందిన మనతో గూడ ఆలాగే చెప్తాడు. 4) అంతర్నివాసం లభిస్తుంది వరప్రసాదం ద్వారా ముగ్గురు దైవవ్యక్తులు మన హృదయంలో వసిస్తారు. ఇదే అంతర్నివాసం. ఈ యంశాన్ని కొంచం విపులంగా పరిశీలిద్దాం. క్రీస్తు మన హృదయంలో వసిస్తాడు. క్రీస్తు ఆజ్ఞలను పాటిస్తే క్రీస్తు అతని తండ్రీ విచ్చేసి మన హృదయంలో నివసిస్తారు –యోహా 14,21. ఈ భావాన్నే యోహాను ద్రాక్షతీగ దాని రెమ్మలు అనే వుపమానంలో గూడ తెలియజేశాడు. రెమ్మలు తీగెలోనూ తీగ రెమ్మల్లోను వసిస్తుంటాయి. ఆలాగే క్రీస్తు మనలోనూ, మనం అతని లోనూ వసిస్తుంటాం -15, 5. ఇదే సత్యాన్ని పౌలు భక్తుడు శిరస్సు అవయవాలు అనే వుపమానంలో తెలియజేశాడు. క్రీస్తు శిరస్సు మనం అతని అవయవాలం. అతడూ మనమూ కలసి వొక్క జ్ఞానశరీరం ఔతాం -1కొరి 12,27. ఆదాము మనకు భౌతిక జీవమిచ్చి మనలో వసిస్తున్నాడు. రెండవ ఆదామైన క్రీస్తు మనకు ఆధ్యాత్మిక జీవమిచ్చి మనలో వసిస్తుంటాడు - 1కొరి 15,45. కనుకనే పౌలు భక్తుడు ఇప్పడు నేను కాదు, నా యందు క్రీస్తే వసిస్తున్నాడు అని చెప్పకొన్నాడు —గల 2,20. క్రీస్తుతో పాటు తండ్రి మనలో వసిస్తుంటాడు. తండ్రీ కుమారుడూ కలసే వుంటారు. ఒకరున్న చోట ఇంకొకరు కూడ వుంటారు. క్రీస్తూ