పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దైవకుటుంబంలో మనం దేవునికి దత్తపుత్రులమైనా నిజమైన పుత్రులమే. కనుకనే యోహాను మొదటి జాబు మనం దేవుని బిడ్డలమని పిలువబడ్డం మాత్రమే కాదు, యథార్థంగా దేవునికి బిడ్డలం అని చెప్తుంది -3, 1. మనంతట మనం ఎంత ప్రయత్నం చేసినా దేవుని బిడ్డలం కాలేము. క్రింది అంతస్తులో వున్నవాడు ఎన్నిసార్లు అటూయిటూ తిరిగినా పై అంతస్తులోకి పోలేడు. పైకి పోవాలంటే మెట్లెక్కి పోవాలి. మానవులమైన మనలను పైయంతస్తులోకి కొనిపోయే మెట్ల వరుసే క్రీస్తు. ఆ ప్రభువుకి మనం సదా కృతజ్ఞలమై యుండాలి. 2) మోక్షాన్ని వారసంగా పొందుతాం యూదులు యావే ప్రజలైనందున కనాను దేశాన్ని వారసంగా పొందారు. దేవుని పుత్రులమైనందున మనం మోక్షాన్ని వారసంగా పొందుతాం. క్రీస్తుతో పాటు పుత్రులమైతే అతనితోపాటు వారసులమౌతాం -రోమా 8, 17. తండ్రి ఆస్తి పిల్లలకు సంక్రమించినట్లే దేవుని ఆస్తియైన మోక్షం మనకు సంక్రమిస్తుంది. వరప్రసాదమే ఈ ఆస్తిని మనకు చేకూర్చిపెడుతుంది. మనకు మోక్షం లభిస్తుందని సూచిస్తూ దేవుడు పవిత్రాత్మను మనకు సంచకరువుగా దయచేశాడు. సంచకరువు లేక బయానా భవిష్యత్తులో చెల్లించబోయే పూర్తి సొమ్మకి గురుతు. ఆలాగే పవిత్రాత్మ మనకు మోక్షం లభిస్తుంది అనడానికి గురుతుగా వుంటుంది -ఎఫె 1,14. వరప్రసాదం ఆర్జించి పెట్టే మోక్షం మన కోరికలన్నీటినీ తీరుస్తుంది. అక్కడ దేవుణ్ణి దర్శించి పూర్ణానందం పొందుతాం. 3) దేవునికి ఇష్టులమూ ప్రీతిపాత్రులమూ ఔతాం వరప్రసాదం మనలను న్నూతమానవులనుగా తయారుచేస్తుంది. ఎవడైన క్రీస్తునందుంటే అతడు నూతసృష్టి ఔతాడు-2కొరి 5, 17. పాపి దేవునికి అనిష్ణుడు, శత్రువు. వరప్రస్తాద్రం మన పాపాలను తొలగిస్తుంది.