పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అవయవాలు కలసి ఒక్క దేహంగా ఏర్పడినట్లుగా వుంటుంది -1కొరి 12,27. తల్లి తీగ రెమ్మలూ కలసి ఒక్క ద్రాక్షతీగగా ఏర్పడినట్లుగా వుంటుంది -యోహా 15, 5. పుల్ల మామిడిమీద తీయమామిడిని అంటుకడతారు. దానివలన తీయుమామిడి మొక్క తీయని పండ్లు కాస్తుంది. వరప్రసాదం ద్వారా పాపులమైన మనం క్రీస్తుతో ఐక్యమై పుణ్యక్రియలు అనే ఫలాలు కాస్తాం. వరప్రసాదం మనలో పెద్ద మార్పు తెస్తుంది. మన తలపుల్లో చేతల్లో క్రొత్తతనం గోచరిస్తుంది. 2. వరప్రసాద ఫలితాలు వరప్రసాద ఫలితాలు చాల వున్నాయి. ఇక్కడ కొన్నిటిని పరిశీలిద్దాం. 1) దత్తపుత్రులమతాం క్రీస్తు తండ్రికి సహజపుత్రుడు. అతనిది దైవస్వభావం. మనం దేవునికి సహజ పుత్రులం గాదు. దత్తపుత్రులమౌతాం. క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినప్పడే అతని తండ్రి మనకు తండ్రి ఔతాడు. లోకారంభం నుండి తండ్రి మనలను తన పుత్రులనుగా ఎన్నుకొన్నాడు -ఎఫె 1,5. క్రీస్తు ద్వారానే మనకు దత్తపుత్రత్వం లభిస్తుంది. యూదులు దేవుణ్ణి తండ్రిగా గాక యజమానుణ్ణిగా భావించారు. మేము అతనికి బానిసలం అనుకొన్నారు. అతన్ని చూచి భయపడ్డారు. కాని క్రైస్తవులమైన మనం క్రీస్తు ద్వారా దేవుణ్ణి చనువుతో పరలోకంలోని మా తండ్రీ అని పిలవగలుగుతున్నాం. క్రీస్తుద్వారా మనలను దేవునికి దత్తపుత్రులనుగా చేసేది పవిత్రాత్మ దేవుని ఆత్మ మన హృదయాల్లోకి ప్రవేశించి మనం దేవుణ్ణి తండ్రీ అనిపిల్చేలా చేస్తుంది -ෆෆ 4,6. మానవ కుటుంబంలో దత్తపుత్రుడు తండ్రి స్వభావంలో పాల్గొనడు. అతడు తండ్రి ఆస్తిని పొందినా ஆ- కుమారుడు కాదు. కాని