పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కలుగును గాక అంటూంటాడు -యోహా 20, 19. అతని మరణోత్థానాలు మన పాపాలకు శాంతి చేస్తాయి. పాపాలకు పశ్చాత్తాపపడి మంచి పాపసంకీర్తనం చేసికొంటే హృదయానికి ఏ లోక వస్తువులూ ఈయలేని శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో పశ్చాత్తాపం ఓ ప్రధానాంశం. పాపం, పశ్చాత్తాపం అనే భావాలు మన క్రైస్తవమతంలోని ముఖ్యాంశాలకు చెందినవి. ఆధునిక ప్రపంచంలో నరులు తేలికగా, పాపంలో పడిపోతుంటారు. సాధకుడు ఎప్పటికప్పుడు తన పాపాలను జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపపడి హృదయశుద్ధిని పొందుతూండాలి. నిర్మల హృదయులు పరమ పవిత్రుడైన భగవంతునికి చేరువౌతారు. 6. వరప్రసాద జీవితం 1. వరప్రసాదం అంటే యేమిటి? ఆధ్యాత్మిక జీవితమంటే ప్రధానంగా వరప్రసాద జీవితమే. వరప్రసాదం మనలోని ఓ దివ్యగుణం. దాని వలన దైవస్వభావంలో భాగస్వాములమాతాం -2పేతురు 1,4. దేవునికి ప్రీతి కలిగిస్తాం. పాపపరిహారాన్ని పొందుతాం. ఈ సృష్టి వస్తువులన్నీ ప్రోగుజేసినా ఒక్క నరునిలోని వరప్రసాదానికి గూడ సాటిరావు. అది అంత దివ్యమైంది, అంత విలువైంది. వరప్రసాదం ద్వారా పవిత్రాత్మ మన ఆత్మమీద ముద్రవేస్తుంది. దివ్యరూపాన్ని చిత్రిస్తుంది. దీని వలన మనం దేవుని పోలికను పొందుతాం. దైవస్వభావంలో పాలుపొందుతాం. వెల్లురు సోకగానే స్పటికం ప్రకాశిస్తుంది. ఆలాగే ఆత్మసాన్నిధ్యం సోకగానే మన ఆత్మ కూడ మెరుస్తుంది. దివ్యత్వాన్ని పొందుతుంది. వరప్రసాదం ద్వారా క్రీస్తుత్తో_ఐక్యమౌతాం. ఈ యైక్యత శిరస్సు