పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మరణాన్ని వ్యర్థం చేసేంత పెద్దపాపం మనమేమీ చేయలేం. పేతురు ఆశాభావంతో పశ్చాత్తాపపడ్డాడు. అతడు మనకు ఆదర్శం -లూకా 22.62. 6. మంచి పశ్చాత్తాపంలో పూర్వపాపాన్ని విడనాడాలనే కోరిక వుంటుంది. జక్కయ తన పాపపు సొమ్మను వదలించుకోగోరి సగమాస్తిని పేదలకు దానం చేశాడు -లూకా 19,8. ఇదే గట్టి ప్రతిజ్ఞ. పూర్వ పాపాన్ని వదలించుకొనే కోరిక లేకపోతే మన పశ్చాత్తాపంలో నిజాయితీ లేనట్లే. 7. భక్తులు తమ పాపాలకు ఒకటి రెండుసార్లు కాదు, జీవితాంతం పశ్చాత్తాపపడ్డారు. పౌలు అంతటి వాడు తన జీవితం చివరలో కూడ నేను పాపుల్లో ప్రథముణ్ణి అని చెప్పకొన్నాడు -1తిమో 1,15. మన ప్రార్థనల్లో పశ్చాత్తాప జపం కూడ ఓ భాగం కావాలి. రోజూ రాత్రి పాపాలకు పశ్చాత్తాప పడి కాని నిద్రపోకూడదు. 8. మన పాపాలకు ముఖ్యకారణం లోకవస్తు వ్యామోహం. లోక వస్తువులను ఉపయోగించుకోగూడని పద్ధతిలో ఉపయోగించుకొని పాపంలో పడిపోతాం. అవివేకియైన ధనికుడు వస్తువ్యామోహంలో చిక్కుకొని దేవుణ్ణి విస్మరించాడు -లూకా 12,19. మనం నిరంతరం ఇద్దరు యజమానులను సేవిస్తుంటాం. ఒకవైపు దేవుణ్ణి మరోవైపు లోకవస్తువులనూ కొలుస్తుంటాం -మత్త 6,24. చాల పాపాలకు ఇదే కారణం. అనన్య హృదయంతో దేవుణ్ణి సేవించేవాడే నిజమైన భక్తుడు. 9. యెరూషలేము దేవాలయంలో పాపపరిహారానికి జంతుబలులు సమర్పించేచవాళ్లు. కాని కీర్తనకారుడు నేను సమర్పించేబలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే అన్నాడు. దేవునికి సమర్పించే బలి ఏదో పశువు కాదు, మన హృదయమే –53, 17. పశ్చాత్తాపంతో కూడిన హృదయం అతనికి ప్రీతి కలిగిస్తుంది. 10. ఉత్థానక్రీస్తు శిష్యులకు_ద్రర్శనమిచ్చినపుడెల్ల మీకు శాంతి