పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. ప్రభువు తన బోధను పశ్చాత్తాపంతోనే ప్రారంభించాడు. దైవరాజ్యం సమీపించింది. పశ్చాత్తాపపడి మనసు మార్చుకొనండి అని చెప్పాడు -మత్త 4,17.నరుడు మొదట పశ్చాత్తాపం చెందిహృదయశుద్ధిని పొందాలి. ఆ పిమ్మటనే గాని దైవరాజ్యంలో చేరడు.

       2. జనుడు పాపం ద్వారా దేవుని యింటి నుండి వెళ్లిపోతాడు. పశ్చాత్తాపం ద్వారా మళ్లా ఆ యింటికి తిరిగివస్తాడు. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపం చెంది తండ్రివద్దకు తిరిగివచ్చాడు -లూకా 15,20. బాబిలోనియాదేశానికి ప్రవాసం పోయిన యూదులు మళ్లాయెరూషలేముకు తిరిగి వచ్చారు. మనం కూడ ప్రభువు చెంతకు మరలివచ్చి అతనితో రాజీపడాలి.

3. పూర్వ వేదం పేర్కొనే భగవంతుడు పశ్చాత్తాప ప్రియుడు. అతడు పాపి నాశంకావాలని కాక పరివర్తనం చెంది మళ్లా బ్రతకాలని కోరుకొంటాడు -యెహె 33, 11. తండ్రి కుమారుని మీద జాలి జూపినట్లే మనమీద కరుణ జూపుతాడు -కీర్త 103, 13. నూతవేదం పేర్కొనే క్రీస్తు కూడ నెనరు కలవాడు. అతడు రోగులకొరకు వచ్చిన వైద్యుడు -మత్త 12.20. కరుణామయుడైన ప్రభువుని స్మరించుకొని మన పాపాలకు పశ్చాత్తాపపడాలి. 4. పాపమైతే ఎగిరెగిరి చేస్తాం. పశ్చాత్తాపమైతే మనంతట మనం పొందలేం. పాపం చేశాక రెక్కలు విరిగిన పక్షిలాగ నిస్సహాయ స్థితిలో వుండిపోతాం. ప్రభువే మనకు పశ్చాత్తాపం పుట్టించాలి. కనుకనే యిర్మీయా నీవు మా మనసు మార్చితే అప్పడు మేము మనసు మార్చుకొంటాం అని ప్రార్థించాడు -31,18. దేవుని వరప్రసాదం మన హృదయాన్ని కదిలించాలి. 5. నేనెంత పెద్దపాపం చేశాను, దేవుడు నన్ను మన్నిస్తాడా అని శంకించకూడదు, నిరుత్సాహసడకూడదు. అది యూదా పద్ధతి. క్రీస్తు సిలువఒ