పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

7. నరులు అన్ని తావుల్లోను అన్ని పదవుల్లోను కూడ పాపంలో పడిపోతారు. దేవదూతలు స్వర్గంలో పాపం చేశారు. ఏదెను తోటలో దేవునితో కలసి తిరిగే ఆదిదంపతులు పాపంలో పడిపోయారు. మూడేండ్లపాటు ప్రభువుకి శిష్యుడుగా మెలిగిన యూదా పాపంలో పడిపోయాడు. మనం వీరికంటె గొప్పవాళ్లం కాదు. 8. మన పాపాలను సమీక్షించి చూచుకోవాలి. బాల్యంలో యూవనంలో నడివయస్సులో నేనెన్ని పాపాలు చేశానా అని పరిశీలించి చూచుకోవాలి. ఆయా తావుల్లో ఆయా వ్యక్తులతో కలసి మనం చేసిన పాపాలను జ్ఞప్తికీ తెచ్చుకోవాలి. తలంపులు మాటలు చేతల ద్వారా ఎన్నో తప్పలు చేసివుంటాం. అగస్టీను భక్తుడు నేను చిన్నప్పుడే చాల తప్పలు చేశాను. వాటిని కుప్పవేస్తే కొండంత అయ్యాయి అని చెప్పకొన్నాడు. 9. పరమ పవిత్రుడైన భగవంతుడు పాపాన్ని సహించడు. వెల్లురు చీకటిని అంగీకరించదు. దేవుడు పాపిని కాదు గాని పాపాన్ని తప్పక అసహ్యించుకొంటాడు. ప్రభువు పాపిని చూడ్డానికి యిష్టపడక మొగం ప్రక్కకు తిప్పకొంటాడు -యెష 64,7. పాపిని తన సన్నిధి నుండి గెంటివేస్తాడు - కీర్త 51, 11. కనుక భక్తుడు ఎల్లప్పుడు పాపానికి దూరంగా వుండాలి. పవిత్రుడైన ప్రభువును గుర్తుకు తెచ్చుకొని పాపానికి భయపడాలి. పాపానికీ ఆధ్యాత్మికతకూ చాలదూరం. 2. పశ్చాత్తాపం నరుడు దుర్భల ప్రాణి. పిడికెడు మట్టిముద్ద సులువుగా పాపంలో పడిపోతుంటాడు. ఈ పాపాలకు పశ్చాత్తాపపడాలి. దేహానికి మురికైతే స్నానంతో శుద్ధిని పొందుతాం. ఆత్మ పాపం వలన మలినమైపోతే పశ్చాత్తాపంతో శుద్ధిని పొందాలి. ఇక్కడ పశ్చాత్తాపాన్ని గూర్చి బైబులు బోదించే బావాలు కొన్ని పరిశీలిదాం