పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3. పాపంచేసినప్పడు భగవంతుణ్ణి విడనాడి లోకవస్తువుల్లోకి వెళ్లిపోతాం. ప్రతి పాపమూ సృష్టికర్తను త్యజించి సృష్టి వస్తువుల్లోకి వెళ్లిపోవడమే. తప్పిపోయిన కుమారుడు తన్ను ప్రేమతో జూచే తండ్రిని వదలివేసి లోకవస్తువుల్లోకి వెళ్లిపోయాడు. ఆ వస్తువులు తనకు ఎక్కువ ప్రీతి కలిగిస్తాయని భ్రాంతి పడ్డాడు. ప్రపంచ వస్తువులు మనం దేవుని దగ్గరికి యొక్కి పోవడానికి నిచ్చెన మెట్లలాగ వుపయోగపడతాయి. అవి మనకు ఆటంకం కాకూడదు. చేప వలలో లాగ మనం వాటిల్లో చిక్కుకోగూడదు. మామూలుగా మనకు బంధాలుగా పరిణమించేవి ధనం, పదవులు, సుఖభోగాలు, కీర్తిప్రతిష్టలు మొదలైనవి. చాలమంది వీటిల్లో చిక్కుకొని దేవునికి దూరమై పోతుంటారు. 4. పాపం చేసినప్పడు పిశాచంతో చేతులు కలుపుతాం. యూదాలోకి దయ్యం ప్రవేశించగా అతడు గురువును పట్టీయడానికి పూనుకొన్నాడు – యోహా 13, 27 పాపి పిశాచాన్ని నాయకుణ్ణిగా ఎన్నుకొని అతన్ని అనుసరిస్తాడు. అతనితో నీ రాజ్యం వచ్చును గాక అని చెప్తాడు. 5. పాపం కట్టుకొన్నపుడు హృదయ దేవాలయాన్ని అమంగళం చేస్తాం. జ్ఞానస్నానం నుండే మన హృదయం పవిత్రాత్మకు ఆలయమతుంది. -1కొరి 6,19. కాని పాపం వలన పవిత్రాత్మ హృదయం నుండి వెళ్లిపోతుంది. పిశాచం దానిమీద కొలువుతీరుతుంది. పవిత్ర్మాను దీపాన్ని లాగ ఆర్పివేస్తాం. హృదయం చీకటితో నిండిపోతుంది. 6. పాపం వలన దేవుని శాపానికి గురౌతాం. ప్రభువు కాయలు కాయని అంజూరాన్ని శపించాడు. దానికి పండ్లు లేవు. మనకు సత్ర్కియలూ పశ్చాత్తాప ఫలాలూ వుండవు -మత్త 21, 19. మనం పండ్లు కాయని అంజూరంలాగ నిప్ర్పయోజకులమతాం -లూకా 13,7. దేవునికి ప్రీతి కలిగించం.