పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

5. పాపమూ, పశ్చాత్తాపమూ 1. పాపం మనం కొలిచే భగవంతుడు పరమ పవిత్రుడు. దేవదూతలు అతని సన్నిధిలో గడగడవణకుతూ ముఖాలు కప్పకొంటారు. పాపపు ప్రాణి యేదీ అతని యెదుట నిలవలేదు. పాపాన్ని విసర్జించందే ఆధ్యాత్మికత ඒඨ. కనుక భక్తుడు తన పాపాలను గూర్చి లోతుగా ఆలోచించి చూచుకోవాలి. వాటిని త్యజించాలని నిశ్చయించుకోవాలి. ఇక్కడ పాపాన్ని గూర్చిన బైబుల్లోని భావాలు కొన్నిటిని పరిశీలిద్దాం. 1. పాపమంటే దేవునిమీద తిరుగుబాటు చేయడం. ఆదామేవలు చెట్టుపండు తినడంలో ఉద్దేశమేమిటి? తాము దేవునికి లొంగి వుండకూడదు అనుకొన్నారు. స్వతంత్రులుగా వుండగోరారు. వారి మంచి చెడ్డలను వారే నిర్ణయించుకోగోరారు. కుండ కుమ్మరిమీద తిరగబడినట్లయింది. కుర్చీ వడ్రంగిని ఎదిరించినట్లయింది. అందుకే దేవుడు వారిని అంత కఠినంగా శిక్షించింది. ఇప్పడు మన పాపంలో కూడ దేవుణ్ణి ధిక్కరించడం, అతనిమీద తిరగబడ్డం అనే గుణం వుంటుంది. 2. పాపమంటే దేవుని సన్నిధిలో నుండి వెళ్లిపోవడం. అతనికి దూరం కావడం. పాపానికి ముందు ఆదామేవలు దేవునితో కలసి తిరిగేవాళ్లు. పాపం చేశాక అతని సన్నిధిలోకి రావడానికి మొగం చెల్లక చెట్లనడుమ దాగుకొన్నారు -ఆది 3,8. కయీను తమ్ముణ్ణి చంపాక దేవుని యెదుటకి రావడానికి జంకి దూరంగా వెళ్లిపోయాడు -4, 16. దీనికి భిన్నంగా అబ్రాహాము దేవుని సన్నిధిలో మెలిగాడు -17, 1. కీర్తనకారుడు యెరూషలేము దేవళంలోకి పోవాలని వువ్విళూరాడు -12,21. మనం కూడ పాపం చేసినప్పడు దేవునికి దూరమౌతాం.