పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గులాబీ పూవు తన సువాసన ద్వారానే జనాన్ని ఆకర్షిస్తుంది అన్నారు. ఆదర్శవంతమైన క్రైస్తవ జీవితమే గొప్ప బోధ. తల్లిదండ్రులు పిల్లలను క్రైస్తవ విశ్వాసంలో పెంచాలి. వాళ్లకు మన ఆస్తులను ఇస్తేనే చాలదు. మన వివ్వాస సంపదను కూడ పంచియియాలి. మామూలుగా మన పిల్లలు మనకంటె యొక్కువ భక్తిమంతులు కారు. పైన పేర్కొన్న ఆదర్శ జీవితం తర్వాత రెండవదిగా, విశ్వాసులకు నోటితో బోధించే అవకాశాలు కూడ వస్తాయి. వీటిని జాగ్రత్తగా వాడుకోవాలి. దీనికి మనకు కొంత తర్ఫీదు వుండాలి. బైబులు, విశ్వాస సత్యాలు మొదలైనవి మొదట మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. తర్వాత ఇతరులకు కూడ నేర్పించాలి. ఆత్మప్రబోధం, ఆంతరంగిక ప్రేరణం కూడ వుండాలి. ఎప్పడూ స్వీయ ప్రేరణంతో చేసినపని శక్తిమంతమైన కార్యం ఔతుంది. గొప్ప ఫలితాన్ని చేకూరుస్తుంది. ఇతరులకు కూడ ప్రేరణం పుట్టిస్తుంది. మన క్యాతలిక్ సమాజంలో చాలమందికి అసలు ప్రేషిత సేవ చేయాలనే ఆలోచనే వుండదు. ఇది పెద్ద లోపం. ఎవరికి వాళ్లుగా వుండిపోతారు. సువార్త సందేశాన్ని అంగీకరించి జ్ఞానస్నానం పొందిన వాళ్లంతా సువార్త బోధకులుగా మెలగవలసిందే. జ్ఞానస్నానం పొందిన క్రైస్తవుడు ప్రధానంగా క్రీస్తుకి సాక్షిగా వుండేవాడు. క్రీస్తుని యితరులకు తెలియజేసేవాడు. ప్రభువును ఇతరులకు తెలియజేసే కొద్దీ మన భక్తి విశ్వాసాలు కూడ పెరుగుతాయి. ఈ సందర్భంలో సువార్తను బోధించకపోతే ত০ పరిస్థితి దారుణమాతుంది అన్న పౌలు భక్తుని వాక్యం మనకు ప్రేరణం పుట్టించాలి -1Յ°C 9, 16.