పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జాతులకు సువిశేష సందేశాన్ని ప్రకటించాలి -మార్కు 13, 10. అటు తర్వాతనే లోకాంతం, తీర్పు వస్తాయి. సువిశేష బోధ ఎల్లరూ చేయాలి. అన్ని సువిశేషాల్లోను సమస్త జాతులకు సువార్తను బోధించాలనే క్రీస్తు ఆజ్ఞ వుంది -మత్త 28, 19; యోహా 20, 21. ఈ యాజ్ఞను అందరమూ తప్పక పాటించాలి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి పంపాడు - యోహా 3,6. మనం పూర్వమే ఈ ప్రేమను పొందాం. ఇప్పడు దాన్ని యితరులకు కూడ అందీయాలి. క్రీస్తు అనంత ఐశ్వర్యాలు అందరికీ దక్కాలి -ఎఫె 3,8. దేవునికి మనం చూపే బదులు ప్రేమే ప్రేషిత సేవ ఔతుంది. మన విశ్వాసాన్ని యితరులతో పంచుకోవాలి. ఇతర గొర్రెలను కూడ మందలోనికి కొనిరావాలి -యోహా 10,16. ప్రేషిత సేవ ద్వారా మన సోదరప్రేమను ప్రకటిస్తాం. పూర్వవేదంలో యూదులు అన్యజాతులకు దీపమయ్యారు -యెష 49,6. ఇప్పడు మనమే ఆ దీపం కావాలి. పూర్వం విదేశ గురువులు మన తాతముత్తాలకు బోధచేసి వారికి విశ్వాసబ్యోతిని అందించారు. ఇప్పడు మన ప్రజలకు మనమే బోధ చేయాలి. 13వ లియోపోపుగారు ఆనతినిచ్చినట్లుగా ఓ భారతదేశమా! నీ బిడ్డలే నీకు రక్షణ కారకులౌతారు. క్రీస్తు దైవరాజ్యాన్ని స్థాపించి దాన్ని తండ్రికి అర్పిస్తాడు -1కొరి 15, 24 ఇప్పడు మనం కూడ ఈ కార్యంలో పాల్గొనాలి. ప్రేషితకార్యం తండ్రిని మహిమ పరుస్తుంది. සඹී, విశ్వాసులు వేదబోధ ఏలా చేయాలి? సంసారజీవితం గడిపే వాళ్లు మొదట తమ ఆదర్శ జీవితం ద్వారానే క్రీస్తుని ప్రకటిస్తారు. మన భక్తి గల జీవితం తోడి విశ్వాసులకు ప్రేరణం పుట్టిస్తుంది. అన్యమతస్థులను గూడ ఆకర్షిస్తుంది. క్రైస్తవ బోధకులను గూర్చి మాట్లాడుతూ గాంధీగారు