పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మనవి మాట చాలా యేండ్లనుండి ఆధ్యాత్మిక విషయాలను పురస్కరించుకొని ఓ గ్రంథం వ్రాయాలని ఆలోచిస్తూ వున్నాను. ఆ కోరిక ఈ నాటికి నెరవేరినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ ప్రజల్లో 99 శాతం గృహస్థులే. కనుక ఈ పుస్తకాన్ని సంసార జీవితం గడిపే విశ్వాసులను మనసులో పెట్టుకొని వ్రాశాను. ఐనా యిది గురువులకూ, మఠవాసులకూ కూడ వుపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సత్యాలు చాల వున్నాయి. ఆ సంగతులన్నీ ఒక్క గ్రంథంలో ఇమిడ్జ్చి చెప్పలేం. ఇక్కడ ముఖ్యమైన విషయాలు కొన్ని వివరించాం. ఇంకా చెప్పవలసినవి చాల వున్నాయి. ఈ పుస్తకం మన సమాజంలోని ఇతర రచయితలకు కూడ ప్రేరణం పట్టించి పారమార్థిక విషయాల మీద మరికొన్ని గ్రంథాలు వెలువడేలా చేయిస్తుందని ఆశిస్తున్నాను. పూర్వం ఆయాగ్రంథాల్లో నేను వ్రాసిన ఆధ్యాత్మిక విషయాలను ఈ పుస్తకంలో ఒకచోట సంగ్రహంగా పొందుపరచాను. భగవంతుణ్ణి తెలిసికొని సేవించి ప్రేమించడం మహాభాగ్యం. అతడే మనకు ధ్యేయం. ఈ పుస్తకం మనసు భగవంతుని వైపు త్రిప్టుకొనే పవిత్ర కార్యంలో కొందరికైనా వుపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఎందరో భక్త రచయితల భావాలు ఈ గ్రంథంలోకి ప్రవేశించాయి. వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఈ గ్రంథముద్రణకు ఆర్థిక సహాయాన్ని అందించిన డోక్టరు ఇంజె పౌలు పాదరుగారికి వందనాలు. - గ్రంథకర్త GD