పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మన ప్రజల పనితీరులో చాల దురుణాలు వుంటాయి. పై వాళ్లను మెప్పించడానికి పని చేస్తారు. తనిఖీ లేకపోతే పనిచేయరు. చేసేది అరకొరలుగా చేస్తారు. ఇంకొకరు ఆ పనిని మళ్లీ సవరించాలి. సకాలంలో పనికి రారు. సమయం ముగియకముందే జారుకొంటారు. ఈలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులమైన మనం నిజాయితీతో పని చేయాలి. శ్రమ ఏవ జయతే అనే సూక్తి నుండి ప్రేరణం పొందాలి. మన పని వల్లనే రేపు మనకు పరలోకంలో బహుమతిగాని దండనం గాని లభిస్తాయి. ఈ సందర్భంలో పని విలువను గూడ బాగా అర్థం జేసికోవాలి. పనిచేయడమంటే భగవంతుణ్ణి పూజించినంత బాగా చేసిన పని యితరులకు కూడ వుపయోగపడుతుంది. కనుక దాని ద్వారా సోదరప్రేమను పాటిస్తాం. పనివలన ఉన్నతమైన నరులంగా మారతాం. మన శక్తి సామర్థ్యాలు వృద్ధి చెందుతాయి. పని ద్వారా సంపద పెరుగుతుంది. పనివల్ల ఈ లోకాన్ని నరులు వసించడానికి మరింత యోగ్యమైనదానిగా తీర్చిదిద్దుతాం. నూత్న భూమినీ నూత్న దివినీ సృజిస్తాం. కనుక అందరమూ పని సంస్కృతిని పెంచుకోవాలి. 5. గృహస్టుల ప్రేషిత సేవ ప్రేషిత సేవ అంటే క్రీస్తుని ఇతరులకు తెలియజేయడం. ఇతరులు కూడ దైవరాజ్యంలో చేరి క్రీస్తు కొనివచ్చిన రక్షణభాగ్యంలో పాలు పంచుకొనేలా చేయడం. గురువులు మఠవాసులతో పాటు గృహస్థులు కూడ ప్రేషిత సేవకు పూనుకోవాలి. నూటికి 98 శాతమైన గృహస్థులు కూడ బోధచేస్తేనే గాని తిరుసభ వ్యాప్తి చెందదు. అందరమూ మన విశ్వాసాన్ని అన్యులతో పంచుకోవాలి. మనం ప్రేషిత సేవ ఎందుకు చేయాలో బాగా తెలిసి వుండాలి. క్రీస్తు వుత్థానానికీ రెండవ రాకడకు మధ్యకాలం బోధన కాలం. ముందుగా సమస (இ) —o