పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెండు సూత్రాలను పాటించాలి. మొదటిది, మన పనిని శక్తికొలది చేయాలి. ఒళ్లు దాచుకోగూడదు. పైవాళ్లు చూచినా చూడకపోయినా మన పనిని మనం సంతృప్తికరంగా చేయాలి. రెండవది, చేసిన పనిని క్రీస్తుకి సమర్పించాలి. పౌలు భక్తుడు మీ పనులన్నీ క్రీస్తుపేరిట చేయండి అని ఆదేశించాడు -కొలో 3,17. క్రీస్తుకి సమర్పించడం ద్వారా ఆ ప్రభువు ముద్ర మన పనిమీద పడి దానికి విలువ వస్తుంది. మామూలు తెల్లకాగితానికి ఏ విలువలేదు. ప్రభుత్వం వారి ముద్ర దానిమీద పడగానే దానికి వంద రూపాయల విలువ వస్తుంది. ఈలాగే క్రీస్తు ముద్ర మన పనికి విలువను ఆపాడదిస్తుంది. ఇంకా ముఖ్యమైన పనులకు ముందు దైవ సహాయాన్ని అడుగుకోవాలి. దైవబలం వల్ల మన పనులు సులువుగా నెరవేరుతాయి - సామె 3,6. పనిని ప్రార్ధనగా మార్చుకోవాలి. మనం రోజంతా పనిలో మునిగి వుంటాం. ప్రార్థనకు ఎక్కువ కాలం కేటాయించలేం. కనుక మన పనిని ప్రార్ధనగా మార్చుకోవాలి. ఏలాగ? ఉదయకాల సమర్పణం ద్వారా. ప్రతిరోజు వుదయాన్నే ఆ రోజు పనులన్నీ దేవునికి సమర్పించుకొని వాటిని చిత్తశుద్ధితో చేయాలి. దీనికి జపపుస్తకాల్లోని ఉదయకాల సమర్పణను వాడుకోవచ్చు. లేదా సొంతంగా మనమే సమర్పణ ప్రార్థనను చెప్పకోవచ్చు. ఈ సమర్పణం వలన మన రోజువారి పనులన్నీ ప్రార్ధనగా మూరిపోయి పవిత్రమాతాయి. మనమూ మన పనీ సజీవబలిగా తయారుకావాలి - రోమా 12, 1. పూర్వం యెరూషలేము దేవాలయంలో జంతుబలులు సమర్పించారు. ఇప్పుడు మనం మన జ్ఞానస్నాన జీవితమనే బలినే దేవునికి సమర్పించాలి. ఒక్క విషయం నొక్కి చెప్పాలి. మన దేశంలో చాలమంది పనిని సరిగా చేయరు. పని చేయకుండానే జీతం తీసికొని పోవాలిన చూస్తారు.