పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పవిత్రులు కావాలి. కనుక పనిని గూర్చి లోతుగా ఆలోచించాలి. దైవశాస్ర రీత్యా పనిలో మూడు ప్రధానాంశాలు వున్నాయి. 1)ఆదాము పాపానికి ముందు పనిలో కష్టమేమీ లేదు. అది ఆనందంగానే వుండేది. ఏదెను తోటను సాగు చేయడమూ కాపాడ్డమూ ఆదాము పని -ఆది 2,15, 2)కాని పాపం తర్వాత ఆ పని కష్టమైన కార్యంగా మారిపోయింది. ఆదాము నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకోవలసి వచ్చింది -3, 19, 3) ఇప్పడు క్రీస్తు పని ద్వారా మన పని పవిత్రమౌతుంది. చాలమందికి పనంటే యిష్టం వుండదు. కనుక దాన్ని తప్పించు కోవాలని చూస్తుంటారు. కాని దానిపట్ల మనకు పవిత్రమైన భావాలు వుండాలి. పరలోకంలోని తండ్రి పనిచేసేవాడు. లోక ဇိုင္ငံမ္ဟ ఈజిప్టు దాస్యవిముక్తి అతని రెండు పనులు. క్రీస్తు పని చేసినవాడు. మరణోత్థానాల ద్వారా మనకు పాపవిముక్తి కలిగించడం అతని పని. తొలి నరుడు ఆదాము ఏదెను తోటలో పని చేశాడు -ఆది 2,15. పౌలు భక్తుడు పని చేయనివాడు కూడు తినడానికి అరుడు కాడు అని శాసించాడు –2తెస్స 3, 10. అతడు తాను చేసిన సేవకు ప్రభువు నీతిమంతుల కిరీటాన్ని దయచేస్తాడని కూడ నమ్మాడు -2తిమో 48. ఈ యాదర్మాలను అనుసరించి మనం కూడ పనిచేయాలి. దేవునికి పోలికగా వున్న నరుడు దేవునిలాగ పని చేయకపోతే యేలా కుదురుతుంది? క్రీస్తు మన లోకంలోకి ప్రవేశించి మన పనిని చేపట్టాడు. వడ్రంగిగా జీవించి అన్నిరంగాల పనులనూ, పనినంతటినీ పవిత్ర పరచాడు. నా తండ్రి యిప్పటికీ పనిచేస్తున్నాడు. నేనూ పనిచేస్తున్నాను అన్నాడు –యోహా 5,17. లోకాలను కాపాడ్డం తండ్రి పని. అద్భుతాలు చేయడం క్రీస్తు పని. క్రీస్త పని ద్వారా యిప్పడు మన పని పవిత్రంగా మారిపోయింది. క్రైస్తవుడి పని యేలా వుండాలి? ఏ పనైనా పవిత్రం కావాలంటే ○