పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కనుక ఏ వృత్తిలో పనిజేస్తున్నా నరుడు నిర్మలంగా జీవించవచ్చు. పవిత్రత, ప్రేమతో జీవించడంలో వుంటుంది. అందరూ దైవప్రేమతోను సోదరప్రేమ తోను జీవిస్తూ నిర్మలంగా మనుగడ సాగించవచ్చు. పవిత్రతకు పునాది జ్ఞానస్నానం. ఆ సంస్కారాన్ని పొందిన వాళ్లంతా పవిత్రతను పాటించాలి. పవిత్రతేమో వొక్కటే. క్రీస్తు శిష్యులందరికీ ఏకంగా పవిత్రత చెల్లుతుంది. పవిత్రాత్మే అందరికీ పవిత్రతా వరాన్ని ప్రసాదిస్తుంది. గృహస్థుల పవిత్ర గురువులు మఠవాసుల పవిత్రత కంటె కొంచం భిన్నంగా వుంటుంది. గృహస్టుల ఆధ్యాత్మికత వారి సంసార జీవితంతో ముడిపడి వుంటుంది. ఈ జీవితంలో ఎన్నోకష్టాలూ, గొడవలూ, త్యాగాలూ వుంటాయి. తండ్రులు, తాతలు ముసలివాళ్లు రోగులను పరామర్శించవలసిన బాధ్యతలు వుంటాయి. సంసారప్రజలు ఎప్పడూ లౌకికరంగంలో జీవించేవాళ్లు. కనుక వారి ఆధ్యాత్మికత కూడ ఆర్థిక సాంఘిక, భౌతిక విషయాలతో నిండి వుంటుంది. స్త్రీ పురుషుల శారీరక, లైంగిక సంబంధాలతో కూడి వుంటుంది. గృహస్టుల ఆధ్యాత్మికతలో వ్యాధిబాధలూ, పేదరికమూ, ఇరుగుపొరుగు వారితో గొడవలూ స్పర్థలూ మొదలైన అంశాలు తరచుగా కన్పిస్తాయి. గృహస్టుల్లో చాలమందికి దేవుడు మరియమాత అర్చ్యశిషుల పట్ల భక్తి వుంటుంది. తమ పూర్వులనూ వారి జీవిత సంఘటనలనూ సంప్రదాయాలనూ తరచుగా స్మరించుకొంటూ వుంటారు. పొలము పుట్ర, గొడ్డు గోద, పైరు పంటలు ఆదాయ వ్యయాలు, పనులు, వుద్యోగాలు మొదలైన వాటిని నిరంతరం జ్ఞాపకం జేసికొంటూ వుంటారు. సహజంగానే లౌకిక జీవితం గడిపే వాళ్ల ఆధ్యాత్మిక లౌకిక విషయాలతోనే నిండివుంటుంది. ఈలాంటి జీవితం ద్వారానే వాళ్లు పవిత్రులు కావాలి. 4. పని సంస్కృతి గృహసులు లోకంలో పనిజేస్తిక్రొని బ్రతకాలి. ఆ పని ద్వారానే