పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పునరుద్ధరిస్తుందనే తిరుసభ విశ్వాసం. మన తరఫున మనం ఎంతగా లోకంలో కుదురుకొని దాని అభ్యున్నతికి పాటడతామో అంతగానే పవిత్రులమతాం. కనుక మంచి క్రైస్తవుడు నిరంతరం ఒక ప్రక్కపరలోకం వైపు చూస్తుండాలి. మరోప్రక్క ఈ లోకంవైపు దృష్టి సారించాలి. లోకమంటే ప్రధానంగా ఈ భూమిమీద వసించే స్త్రీ పురుషులే కదా! మనం వాళ్లను గాకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం? వారికి కాకపోతే ఇంకెవరికి సేవలు చేస్తాం? న్యాయం, ప్రేమ, పుణ్యం అన్నీ తోడి నరులను పట్టించుకోవడంలోనే యిమిడి వుంటాయి. కనుక లోకాన్ని విస్మరించకూడదు. 3. పవిత్రత అన్ని వర్గాలవాళ్ల బాధ్యత పూర్వం పవిత్రత అనేది గురువులు మఠవాసులు సాధించే కార్యం అనుకొన్నారు. కాని రెండవ వాటికను మహాసభ అందరూ పవిత్రులు కావాలని బోధించింది. నేను పవిత్రుడనైన దేవుణ్ణి. మీరు కూడ పవిత్రులుగా వుండండి -లేవీ 19.2 మీరు పవిత్రులుగా వుండాలని దేవుడు కోరుతున్నాడు –1తెస్స 4,3. క్రీస్తు స్వయంగా, పవిత్రతను పాటించాడు. తన శిష్యులు కూడ వాళ్లు ఏ యంతస్తులో వున్నాసరే, పవిత్రులుగా వుండాలని బోధించాడు. కనుక పవిత్రత అనే గుణాన్ని విశ్వాసులందరూ అలవర్చుకోవాలి. దేవాలయాల్లో మఠాల్లో సేవలు చేసేవాళ్లు మాత్రమే కాదు, విశాల ప్రపంచంలో శ్రమ జేసే వాళ్లకు కూడ పవిత్రత తగుతుంది. కుటుంబ జీవితం గడిపే దంపతులకు, ఆయా వృత్తుల్లో నిమగ్నులయ్యే పనివాళ్లకూ పవిత్రత చెల్లుతుంది. క్రీస్తు పనివాడుగా జీవిస్తూ పవిత్రుడయ్యాడు. మన తల్లియైన తిరుసభ పవిత్రంగా వుంటుంది. ఆలాగే తిరుసభ బిడ్డలందరూ, వాళ్లు అభిషిక్తులైనా లేక లౌకిక రంగంలో జీవిస్తున్నా పవిత్ర జీవితం గడపవలసిందే. అన్ని వృత్తులను దేవుడే చేశాడు. లోకాన్ని కూడ దేవుడే కలిగించాడు.