పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

1. క్రీస్తు ఈ లోకంలో దేవుని పరిపాలనను కొనసాగించడానికి వచ్చాడు. అతడు అన్యాయాలను సహించడు. పేదలను పీడించడం పెద్ద అన్యాయం. అది దేవుని పరిపాలనకు అడ్డు వస్తుంది. 2. క్రీస్తు లోకంలో ప్రేమనూ జీవాన్నీ నెలకొల్పేవాడు. కాని పేదల పీడనంలో హింస, చావు వున్నాయి. కనుక అది క్రీస్తుకి సమ్మతం కాదు. 3. పేదప్రజలు దేవుని రాజ్యం రావాలని నిరంతరం ప్రార్ధన చేస్తున్నారు. బైబులు చదువుతున్నారు. బైబుల్లో కన్పించే దేవుడు ప్రధానంగా పేదలకోపు తీసికొనేవాడు. కనుక అతడు పేదల మొరవిని అన్యాయాలను రూపుమాపుతాడు. ఆర్థిక సాంఘిక రాజకీయ సమస్యలు ప్రార్ధన దైవార్చనలతో కలసిపోవాలి. 4. రైతులు శ్రామికులు మొదలైన పేద ప్రజలే ప్రవక్తలై అన్యాయాన్ని ఎదరిస్తున్నారు. ఐకమత్యంతో పీడకులను ప్రతిఘటిస్తున్నారు. 5. ఆధ్యాత్మికత పరలోక విషయాలకే గాక భూలోక విషయాలకు కూడ వర్తిస్తుంది. నరుడు ఆత్మ శరీరం కూడ. అతడు శారీరకంగా పీడనకు గురైతే అది మంచి ఆధ్యాత్మికత కాదు. కనుక దేవుడు శారీరక పీడనను అణచివేస్తాడు. ల్యాటిను అమెరికా విమోచనోద్యమం తండ్రినీ క్రీస్తునీ ఆదర్శంగా పెట్టుకొంటుంది. బైబులు భగవంతుడు ప్రధానంగా పేదల భగవంతుడు, దరిద్రుల మొర వినేవాడు అని చెప్తుంది. దక్షిణ అమెరికా ప్రజలు ఐకమత్యంగా పోరాడారు. ప్రార్థన చేశారు. దేవుడు తమ మొరవింటాడని నమ్మారు. వారి రాజకీయాలు ప్రార్థన ఒక్కటిగా కలసిపోయాయి. ఇతర దేశాల్లో కూడ సామాజిక అన్యాయాలు జరుగుతూనే వున్నాయి. కనుక దక్షిణ అమెరికా విమోచన వుద్యమం క్రమేణ అన్ని దేశాలకు ప్రాకిపోయింది. అది అన్ని దేశాల ఆధ్యాత్మికతలో భాగమైపోయింది.