పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆంశాలు. ఆత్మే మన హృదయాలను కదిలించి నరులంతా కలసిమెలసి సోదరభావంతో జీవించాలనీ, సంపదలూ వనరులూ అందరూ సమానంగా పంచుకోవాలనీ హెచ్చరిస్తుంది. ఈ భావాలు నేటి మన ఆధ్యాత్మికతలోకి కూడ ప్రవేశించాలి. ఇంకా, వాటికను సభ తర్వాత దేశమంతటా ఆశ్రమాలు వెలిశాయి. ఇవి ప్రధానంగా దేవుణ్ణి ధ్యానించుకొనే పవిత్ర స్థలాలు. ఒక వ్యక్తిని గురువుగా స్వీకరించి చాలమంది సాధకులు అతని చుటూ ప్రోగౌతారు. సాధకులు ఏ మతం వాళ్లయినా కావచ్చు. భగవంతుణ్ణి అనుభవానికి తెచ్చుకోవడం ముఖ్యం. వివిధ మతాల బోధకులు ఆశ్రమంలో బోధలు చేస్తారు. అన్నిమతాల పవిత్రగ్రంథాలు చదువుతారు. ఆరాధనలు ప్రార్థనలు వివిధ మతాల సంప్రదాయాల ప్రకారం కొనసాగవచ్చు. మనకు క్రీస్తు సద్గురువు. ఆ ప్రభువు అడుగుజాడల్లో నడవడం ఆశ్రమజీవితంలో ముఖ్యాంశం. ఈ యాశ్రమజీవితం గూడ నేటి ఆధ్యాత్మికతలో ఓ అంశమైంది. ఆత్మ భక్తులను ప్రేరేపించి వాళ్లు దేశ కాలపరిస్థితులకు అనుగుణంగా మారేలా చేస్తుంది. ఈ మార్పుని మనం అంగీకరించాలి. 5. విమోచన వుద్యమం ల్యాటిను అమెరికా ప్రజల్లో ఎక్కువమంది పేదలు. స్వల్పసంఖ్యాకులైన ధనికవర్గం ఈ పేదలను పీడించి బాధించడం మొదలుపెట్టారు. పేదలంతా ఐక్యమై ధనికవర్గాన్ని ఎదిరించారు. మాకు ధనికులనుండి విమోచనం కావాలని ప్రతిఘటించారు. ఆ ఖండంలో విమోచనోద్యమం ప్రారంభమైంది. 1960 ఈ వుద్యమం వారి ఆధ్యాత్మికత లోకి కూడ ప్రవేశించింది. కాలక్రమేణ ఈ వాదం అన్ని దేశాలకు ప్రాకింది. ల్యాటిను అమెరికా నుండి అన్ని దేశాలకు ప్రాకింది. ల్యాటిను అమెరికా నుండి ఇతర దేశాలకు కూడ ప్రాకిన విమోచన ఉద్యమంలోని ముఖ్యాంశాలు ఇవి.