పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సూర్యాస్తమయం, సుందరమైన పక్షులు జంతువులు, పంటపొలాలు, పూవులు నదులు కొండలు మొదలైనవన్నీ ఎంతో విచిత్రంగా వుంటాయి. వాటి అందాలను చూచి ఆనందించడం అలవాటు చేసికోవాలి. ఇంకా ప్రకృతిలో దేవుని వునికీ క్రియాశక్తీ సంరక్షణ భావమూ వుంటాయి. కనుక దానిలో భగవంతుణ్ణి గుర్తించి ఆరాధించడం అలవాటు చేసికోవాలి. ప్రకృతి ప్రార్థన ఒక రకమైన జపం. 104వ కీర్తన ప్రకృతిలో దర్శనమిచ్చే భగవంతుణ్ణి స్తుతిస్తుంది. క్రీస్తు ప్రకృతితో కలసి జీవించాడు. లిల్లీ పూలను మెచ్చుకొన్నాడు. కొండల్లో, సరస్సు తీరాల్లో, ఓలివు తోపుల్లో ప్రార్థన చేశాడు. కోడి, పిచ్చుక మొదలైన అల్పప్రాణులను గూడ గుర్తించాడు. ఈ విషయాలన్నిటినీ సూచిస్తూ ప్రకృతిని గూర్చిన ప్రత్యేకమైక ఆధ్యాత్మికత ఇటీవలే ప్రచారంలోకి వచ్చింది. మనం కూడ దీన్ని వాడుకోవాలి. 4. భారతీయ సంప్రదాయం వాటికన్ సభ తర్వాత భారత క్రైస్తవుల ఆధ్యాత్మిక సరళిలో కొన్నిమార్పులు వచ్చాయి. వాటికను ఆదేశాలను అనుసరించి మన వేదాంతులు హిందూ సంప్రదాయంతో సంప్రతింపులు జరుపుతున్నారు. హిందూ మతంలో గూడ ఎన్నో మంచి విలువలు వున్నాయి. మనం కూడ వీటిని స్వీకరించాలి అంటున్నారు. ఈ దేశం చాల మతాలకు పుట్టినిల్లు. కనుక అన్యమతాల వారితో ఐకమత్యంగా సామరస్యంగా జీవించాలి. ఆత్మే అన్నిమతాల ప్రజలను ఐక్యం జేస్తుంది. భారతదేశంలో అతి ప్రాచీనమైన నాగరికతా సంస్కృతీ వున్నాయి. పవిత్ర గ్రంథాలు వున్నాయి. కళలు, సంప్రదాయాలు వున్నాయి. ఎందరో ప్రవక్తలు తత్వవేత్తలు జ్ఞానులు ఈ గడ్డమీద వెలిశారు. ఈ దేశప్రజలు అన్ని కాలాల్లోను భగవంతుణ్ణి మక్కువతో వెదుకుతూ పూజిస్తూ వచ్చారు. ఈ యధ్యాత్మిక సంపదను మనg_క్రూడ వుపయోగించుకోవాలి. మనం