పుట:Adhyatmika Jeevitam - Fr P Jojayya.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రేరణం పొందటం ఈ వుద్యమంలోని ముఖ్యాంశం. దీనిలో పాల్గొనే క్రైస్తవులు మేము ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందాం, ఆత్మను స్వీకరించాం, ఆత్మతో నిండిపోయాం అని చెప్పకొంటారు. వీళ్లు స్తుతి, ఆరాధన, విజ్ఞాపన మొదలైన ప్రార్థనా పద్ధతులకు ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తారు. బైబులు శ్రద్ధతో చదువుతారు. వేదబోధకు పూనుకొంటారు. భాషల్లో మాటలాడ్డం, ప్రవచనం చెప్పడం, వ్యాధులు కుదర్చడం, వేదబోధ చేయడం ఉత్సాహంగా పాటలు పాడ్డం మొదలైన కార్యాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. క్రీస్తుని వ్యక్తిగతమైన రక్షకుణ్ణిగా స్వీకరిస్తారు. సామాన్య క్రైస్తవుల్లో లేని వుత్సాహం భక్త్యావేశం వీరిలో కన్పిస్తుంది. ఇతరులతో కలవకుండ ప్రత్యేకమైన బృందాలుగా ఏర్పడ్డం, బైబులును ఎవరి పద్ధతిలో వాళ్లు అమాయకంగా అర్ధం జేసికోవడం, సాంఘిక అన్యాయాలను పట్టించుకోకపోవడం మొదలైనవి ఈ వుద్యమంలోని లోపాలు. ఐనా ఈ వుద్యమంవలన చాలమందికి మత విషయాల్లో భక్తి చురుకుదనమూ వుత్సాహమూ పెరిగాయి. దీని వలన చాలమంది సజీవ క్రైస్తవులుగా మారి భక్తిశ్రద్ధలు అలవర్చుకొని అధికాధికంగా దేవుణ్ణి పూజిస్తున్నారు. 2. స్త్రీ వాదం శతాబ్దాల పొడుగున ప్రపంచమంతట పితృస్వామ్య వ్యవస్థ స్త్రీలను అణచివేసి వారి హక్కులను భంగపరచింది. వారిని అభివృద్ధిలోకి రానీయలేదు. కనుక ఆధునిక కాలంలో మహిళలు వారి హక్కుల కొరకు పోరాడ్డం మొదలుపెట్టారు. స్త్రీలు కూడ పురుషులతో సమానమనీ, సమాజంలో వారికి కూడ పురుషులతో సమానమైన గౌరవమూ గుర్తింపూ వుండాలని వాదించారు. ఇదే స్త్రీవాదం. ఈ వాదం ఇప్పడు క్రైస్తవ ఆధ్యాత్మికతలోకి కూడ ప్రవేశించింది. తిరుసభలో అన్ని పెద్ద పదవులూ అధికారాలూ పురుషుల చేతిలోనే ぎ* స్త్రీలు తమకు కూడ గురుత్వం